బాలయ్య "అఖండ 2" కలెక్షన్స్ "తాండవం".. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే ???
బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "అఖండ 2". తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నందమూరి బాలకృష్ణ మానియానే కనిపిస్తోంది. పలు కారణాలతో పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ.. మొత్తానికి అభిమానులను, సినీ ప్రేమికుల ఆకలి తీర్చింది అని చెప్పాలి. డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రాగా.. 11వ తేదీ రాత్రి నుంచే ప్రేమేయర్ షోలు కూడా పడడంతో థియేటర్‌ల వద్ద బాలయ్య అభిమానుల సందడి చేస్తున్నారు.
కాగా 'అఖండ' మూవీకి సీక్వెల్ గా వచ్చింది ఈ చిత్రం. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. తమన్ మరోసారి తన సంగీతంతో స్పీకర్స్ బద్దలు కొట్టారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. మొత్తంగా వరుసగా ఐదో హిట్ కూడా కూడా అందుకున్నారని అభిమానులు చెబుతున్నారు.

మొత్తంగా బాలయ్య మరోసారి తన నటవిశ్వరూపం చూపించారని అంటున్నారు. ఇప్పుడు లేటస్ట్ గా ఈ సినిమా మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి.. 59.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్‌లోనే డే వన్ కలెక్షన్స్ లలో ఇదే హైయెస్ట్ అని చెబుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రానున్న రోజుల్లో మూవీ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు "అఖండ 3" గురించి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్ని అఫిషియల్ చేసేలా ఎస్.ఎస్. తమన్ పోస్ట్ చేసిన ఒక ఫొటో క్లారిటీ ఇచ్చారు. ఇక అఖండ 2 చివర్లో 'జై అఖండ' పేరుతో 'అఖండ 3' రానున్నట్లు టైటిల్స్ వేసి మూడో భాగం ఉండనున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
The DIVINE ROAR is heard LOUD & CLEAR 💥💥#Akhanda2 collects a gross of 59.5 CRORES+ on Day 1 (including premieres), making it the biggest opener for God of Masses #NandamuriBalakrishna ❤🔥
— 14 Reels Plus (@14ReelsPlus) December 13, 2025
Book your tickets now!
🎟️ https://t.co/8l5WolzzT6#Akhanda2Thaandavam… pic.twitter.com/YpXzF1xRyE
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్












Click it and Unblock the Notifications