ప్రీమియర్స్ రద్దు, టికెట్స్ బుకింగ్స్ లేవు.. బాలయ్య "అఖండ 2 "కి ఏంటి కష్టం !!
నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "అఖండ 2" రేపు ( డిసెంబర్ 5, 2025 )న రిలీజ్ కావాల్సి ఉంది. అంతా బాగుంటే ఇప్పటికే ప్రీమియర్ షోస్ కూడా పడి అభిమానులు అంతా సినిమా చూస్తూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ప్రీమియర్ షో లు రద్దు చేస్తూ మేకర్స్ ప్రకటించడం అందరికీ షాక్ ఇచ్చింది. టికెట్లు తీసుకుని థియేటర్లకు వెళ్లిన ఫ్యాన్స్ నిరాశతో వెనుదిరగాల్సి రావడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో ప్రీమియర్ షో రద్దవ్వడం ఏంటని ఫుల్ ఫైర్ అవుతున్నారు.
కాగా ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా.. సంయుక్త హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించగా.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అఖండ' మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సీక్వెల్ గా పార్ట్ 3 కూడా రాబోతుంది.

కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇలా షో లు రద్దు కావడం.. తెలంగాణలో బుకింగ్ ఓపెన్ కాకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాజమండ్రిలోని అశోక థియేటర్ వద్ద బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. కాకినాడలోని పద్మప్రియ, ఆనంద్ థియేటర్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పలు థియేటర్ల వద్ద ప్రీమియం షో వేయాలంటూ అభిమానులు నిరసన తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో థియేటర్ మేనేజ్‌మెంట్ పరిస్థితిని అదుపుచేయడానికి డబ్బులు రీఫండ్ చేస్తామంటూ సర్దిచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే 'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. గతంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో కలిసి ఈరోస్ సంస్థ మహేశ్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలను నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ.28 కోట్ల బకాయి ఉందని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది.
#Akhanda2 Pan India Grand Release Tomorrow….😞#Akhanda2Thaandavam pic.twitter.com/888juHqszp
— Cinephly (@saichndra) December 4, 2025
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే.. 14 రీల్స్ ప్లస్ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టులో ఆరోపించింది. ఆ మొత్తం చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. మరి ఈ వివాదం సర్దుమణిగి సినిమా రిలీజ్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్












Click it and Unblock the Notifications