రూ.100 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. 20 టికెట్లే అమ్ముడుపోయాయి!!
గత కొన్ని దశాబ్దాల సినీ చరిత్రలో ఏ స్టార్ హీరోయిన్‌కు ఎదురుకాని అవమానకరమైన పరిస్థితిని కంగనా రనౌత్ ఎదుర్కొన్నారు. వందల కోట్ల బడ్జెట్, హాలీవుడ్ స్థాయి యాక్షన్, భారీ ప్రచారంతో వచ్చిన ఒక సినిమా.. చివరకు ఒక షోకి కేవలం 20 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యే స్థాయికి పడిపోయింది. ఇది భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటికీ ఓ సంచలన విషయంగా మారిపోయింది. .
8వ రోజు రూ.4420
ఒకప్పుడు 'క్వీన్', 'మణికర్ణిక' వంటి చిత్రాలతో సూపర్ హిట్లు సాధిచిన కంగనా రనౌత్, తన స్టార్‌డమ్‌ను పెంచుకోవాలని భావించారు. రజనీష్ ఘై దర్శకత్వంలో హాలీవుడ్ 'జేమ్స్ బాండ్' తరహాలో ఒక లేడీ ఓరియెంటెడ్ స్పై థ్రిల్లర్‌గా 'ధాకడ్' చిత్రాన్ని నిర్మించారు. రూ.90 నుంచి రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కోసం కంగనా నెలల తరబడి కఠినమైన యాక్షన్ శిక్షణ తీసుకున్నారు. ఏజెంట్ అగ్నిగా ఆమె మేకోవర్ చూసి అందరూ షాక్ అయ్యారు. 2022, మే నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్న ఫలితం ఎవరూ ఊహించలేదు.

కలలో కూడా అనుకోలేదు. సినిమాపై నెగటివ్ టాక్ రావడం ఒక ఎత్తయితే, దేశవ్యాప్తంగా ఈ సినిమాకు 8వ రోజున కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆ రోజు మొత్తం వసూళ్లు కేవలం రూ. 4,420 మాత్రమే. వంద కోట్ల సినిమాకు ఒక రోజు కలెక్షన్ ఐదు వేల రూపాయలు కూడా దాటకపోవడం బాలీవుడ్ చరిత్రలోనే, దేశ సినీ పరిశ్రమలోనే అత్యంత అవమానకరమైన పరిస్థితిగా నిలిచిపోయింది.
దెబ్బకొట్టిన కార్తీక్ ఆర్యన్
'ధాకడ్' విడుదలైన రోజే కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భులయ్యా 2' కూడా విడుదలైంది. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ప్రేక్షకులంతా అటు వైపే మొగ్గు చూపారు. సినిమాలో కథ కంటే యాక్షన్ సన్నివేశాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం, సామాన్య ప్రేక్షకులకు కథ కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. అదే సమయంలో కంగనా రాజకీయంగా, వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల వల్ల కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయడం కూడా కలెక్షన్లపై ప్రభావం చూపింది. ఈ సినిమాను కొనేందుకు అప్పట్లో ఓటీటీ సంస్థలు కూడా వెనకడుగు వేశాయి. చివరకు శాటిలైట్ హక్కులు కూడా భారీ నష్టాలకు అమ్మాల్సి వచ్చింది. టీవీలో సినిమా వస్తే టీఆర్పీ రేటింగ్స్ అత్యంత దారుణంగా వచ్చాయి.
-
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications