డైరెక్టర్ బాబీ బూతు కామెంట్స్.. వీడియో వైరల్ !!
తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న పేరు బాబీ కొల్లి. ఆయన అసలు పేరు కె.ఎస్.రవీంద్ర. గుంటూరులో పుట్టి పెరిగిన బాబీ.. బి.కాం పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చాడు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పూర్తిగా తన ప్రతిభతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఘోస్ట్‌రైటర్ నుంచి స్టార్ డైరెక్టర్‌గా..
కాగా బాబీ సినీప్రస్థానం మొదట ఘోస్ట్‌రైటర్‌గా ప్రారంభమైంది. 2008లో విడుదలైన శ్రీహరి నటించిన భద్రాద్రి కథతో తనలోని టాలెంట్ నిరూపించుకున్నారు. ఆ తర్వాత వరుసగా డాన్ శీను, బాడీగార్డ్, ఓ మై ఫ్రెండ్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించాడు. బలుపు, అల్లుడు శీను వంటి సినిమాలకు కథలు ఇచ్చి మెప్పించారు. చివరకు 2014లో రవితేజతో వచ్చిన పవర్ ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆయన చేసిన సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ, వెంకీ మామా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. రీసెంట్ గానే ఈ ఏడాది బాలయ్యతో "డాకు మహారాజ్" మూవీతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపించారు.

వనభోజనాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇటీవల కార్తీకమాసం సందర్భంగా కాపు వర్గం నిర్వహించిన వనభోజనాలకు బాబీ హాజరయ్యాడు. అక్కడ చేసిన ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. సాధారణంగా సైలెంట్‌గా ఉండే బాబీ.. ఈసారి పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి భావావేశంతో మాట్లాడటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మీ అందరిని చూస్తుంటే జనసేన బలం, కళ్యాణ్ ఆవేశం.. చిరంజీవి ఓపిక కనిపిస్తోందన్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని.. ఎలాంటి సపోర్ట్ లేకుండా హైదరాబాద్ వచ్చి ఈ స్థాయికి చేరానన్నారు. మన కమ్యూనిటీపై 'ఆవేశపరులు' అనే ట్యాగ్ ఉంది.. కానీ ఓపికతో సాధించగల శక్తి మనకుంది.
స్టార్‌డమ్ వదిలేసి, ఏసీ గదులు పక్కన పెట్టి ప్రజాసేవ కోసం ప్రయాణించే పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అలానే ఆవేశంగా మాట్లాడుతూ.. నీ** ఉన్నాంరా అంటూ వందల కోట్లు వదిలేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో బాబీపై విమర్శలు చేస్తున్నారు. మైక్ అందుకున్నందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఫ్యామిలీ & సినిమా..
బాబీ చెస్ గ్రాండ్‌మాస్టర్ హారిక ద్రోణవల్లి అక్క అనూషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2018లో ఒక కుమార్తె పుట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో #మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ ని బాబీ రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!!












Click it and Unblock the Notifications