మహేష్‌బాబు రెస్టారెంట్‌లో వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా?

వెండితెరపై నటనతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న సినీ తారలు.. వ్యాపార రంగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా లగ్జరీ ఫుడ్, ఫైన్ డైనింగ్ బిజినెస్‌ వైపు టాలీవుడ్ స్టార్స్ చూపు ఎక్కువగా ఉంది. ఈ లిస్ట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికంటే ముందు వరుసలో నిలుస్తారు.

ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఇప్పటికే 'ఏఎంబీ సినిమాస్' మల్టీప్లెక్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్న ఆయన.. తన సతీమణి నమ్రతా శిరోద్కర్, ఏషియన్ గ్రూప్, ప్రముఖ మినర్వా కాఫీ షాప్ భాగస్వామ్యంతో 'ఏఎన్ రెస్టారెంట్స్' చైన్‌ను ప్రారంభించారు.

Do you know how much a water bottle costs at Mahesh Babu s restaurant

సోషల్ మీడియాలో వైరలవుతున్న బిల్లు

ఈ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ ప్యాలెస్ స్టైల్ హోటల్ 'ఏవీఎన్ ప్యాలెస్ హైట్స్' (బంజారాహిల్స్, రోడ్ నెం. 12) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అందుకు కారణం అక్కడ దొరికే ఫుడ్ కాదు.. నెట్టింట వైరల్ అవుతున్న ఒక లగ్జరీ బిల్లు! ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ ఫుడ్ బ్లాగర్ బంజారాహిల్స్‌లోని ఈ లగ్జరీ రెస్టారెంట్‌ను సందర్శించి, అక్కడి ఫుడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌గా షేర్ చేశారు. హోటల్ అంబియన్స్ చాలా రాయల్‌గా, ప్యాలెస్ తరహాలో ఉందని, ఫుడ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. అయితే, అక్కడి మెనూ కార్డులోని ధరలు చూసి మాత్రం నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇక్కడి రేట్లు చూస్తే అడుగు పెట్టడానికే భయపడేలా ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు రెస్టారెంట్లో రేట్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. వాటర్ బాటిల్ రూ.299 !!
మహేష్ బాబు రెస్టారెంట్లో రేట్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. వాటర్ బాటిల్ రూ.299 !!

షాకింగ్ రేట్లు.. వాటర్ బాటిల్ రూ. 299!

బయట మార్కెట్‌లో కేవలం 20 రూపాయలకు లభించే ఒక లీటర్ సాధారణ వాటర్ బాటిల్ ధర ఈ లగ్జరీ రెస్టారెంట్‌లో అక్షరాలా రూ. 299 గా ఉంది. అలాగే సాధారణంగా రూ. 40 కి దొరికే ఒక డైట్ కోక్ క్యాన్ ధర ఇక్కడ రూ. 180 ఛార్జ్ చేస్తున్నారు. కేవలం బేసిక్ బెవరేజెస్‌కే ఈ రేంజ్ ధరలు ఉండటంతో సామాన్యులు షాక్‌కు గురవుతున్నారు. లిక్విడ్ ఐటమ్స్ ధరలే ఇలా ఉంటే, ఇక మెయిన్ కోర్స్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. చికెన్ టిక్కా (స్టార్టర్): రూ. 725 (ఇది ఒక మనిషికి కూడా పూర్తిగా సరిపోదని బ్లాగర్ పేర్కొన్నారు). మటన్ బిర్యానీ: రూ. 600. సదరు బ్లాగర్ కేవలం ఒక స్టార్టర్, ఒక బిర్యానీ, రెండు డైట్ కోక్స్ మాత్రమే ఆర్డర్ చేయగా.. వీటికి టాక్సులు, సర్వీస్ ఛార్జీలు అన్నీ కలిపి మొత్తం బిల్లు ఏకంగా రూ. 1,853 అయింది.

'వారణాసి' కంటే ముందే మహేష్ నుంచి కొత్త సినిమా.. ఎవరూ ఊహించని విధ్వంసం ఇది..
'వారణాసి' కంటే ముందే మహేష్ నుంచి కొత్త సినిమా.. ఎవరూ ఊహించని విధ్వంసం ఇది..

దీన్ని బట్టి ఒక కుటుంబం ఇక్కడికి వెళ్లినట్లయితే కనీసం రూ. 8,000 నుంచి రూ. 10,000 వరకు జేబుకు చిల్లు పడటం ఖాయమని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. ధరలు భారీగా ఉన్నప్పటికీ.. ఫుడ్ క్వాలిటీ, టేస్ట్ విషయంలో మాత్రం ఈ రెస్టారెంట్ టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. సదరు బ్లాగర్‌తో పాటు హోటల్‌ను విజిట్ చేసిన చాలామంది ఫుడ్ లవర్స్.. "ఇక్కడి మటన్ బిర్యానీ హైదరాబాద్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిర్యానీ" అని ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా, ప్రస్తుతం సూపర్ స్టార్ హోటల్ బిల్లు మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ అవుతోంది!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+