ఎవర్రా మీరంతా.. "రాజాసాబ్" థియేటర్లో మొసళ్లతో హంగామా..!
మారుతి దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం "రాజాసాబ్". రెబల్ స్టార్ ఫస్ట్ టైమ్ హార్రర్ జోనర్‌ని ట్రై చేయడంతో.. ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం తెగ ఎదురుచూశారు. ఈ మూవీ నేడు ( జనవరి 9, 2026 ) రిలీజ్ కాగా.. నిన్న ( జనవరి 8, 2026 ) ప్రీమియర్స్ వేశారు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటించగా.. సంజయ్ దత్, జరీనా వాహెబ్ కీలకపాత్రల్లో మెప్పించారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. కాగా బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. దాంతో ఈ మూవీతో వింటేజ్ ప్రభాస్ ని మళ్లీ చూసే ఛాన్స్ వచ్చిందని అంతా ఖుషి అయ్యారు.

ఈ సినిమా విషయానికి వస్తే ఫస్టాఫ్ అదిరిపోయిందని.. ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్ లుక్, ఎంట్రీ సీన్ సూపర్బ్ అంటున్నారు. అలానే కామెడీ సీన్స్ ఈ సినిమాకు మరో హైలెట్ అని అంటున్నారు. అలాగే ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ గ్లామర్ మరింత ప్లస్ అయ్యిందని కూడా చెబుతున్నారు. సంజయ్‌దత్ విశ్వరూపం చూపించారని.. జరీనా వాహెబ్ సెంటిమెంటుతో ఏడిపించేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో మరో హైలైట్ అంటే మొసలి ఫైట్ అనే చెప్పాలి. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నాటి నుంచి మొసలి మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో కూడా ఈ మొసలి ఎపిసోడ్ ఫుల్ క్రేజీగా ఉందని టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ సీక్వెన్స్ మాత్రం ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుందని అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో సినిమాలో సీన్స్ రీ క్రియేట్ చేయడం ట్రెండింగ్ గా మారుతుంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా కొందరు అభిమానులు ఏకంగా మొసలి బొమ్మలను థియేటర్‌లలోకి తీసుకెళ్లి హంగామా చేసినట్టు తెలుస్తోంది. క్లైమాక్స్‌లో ప్రభాస్ మొసలితో ఫైట్ చేసే సన్నివేశం థియేటర్‌లో వచ్చే సమయంలో ఆ బొమ్మలతో స్క్రీన్ వద్దకు వెళ్లి దాన్ని రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఇవి ఏఐతో చేసిన వీడియోలంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఎవర్రా మీరంతా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుంచి మొసలి మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. నేడు ఈ చిత్రం విడుదల కావడంతో ఏకంగా మొసలి బొమ్మలను థియేటర్‌లలోకి తీసుకెళ్లి హంగామా చేస్తున్న ప్రభాస్… pic.twitter.com/Y58d7Bldk5
— oneindiatelugu (@oneindiatelugu) January 9, 2026












Click it and Unblock the Notifications