ఓటీటీలో చిన్న సినిమా విధ్వంసం..ట్రెండింగ్‌లో దూసుకుపోతూ..

సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఓటీటీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో క్రైమ్ థ్రిల్లర్స్, రియల్ పోలీస్ స్టోరీలతో పాటు, రియల్ స్టోరీలకు ఉండే క్రేజే వేరు. ఇప్పుడు అలాంటి ఒక సంచలనాత్మక రియల్ స్టోరీ 'గేదెలరాజు' సినిమా డిజిటల్ స్క్రీన్‌పై దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వయంగా సంగీతాన్ని అందించిన తాజా చిత్రం 'గేదెలరాజు' ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పోలీసులనే భయపెట్టిన హంతకుడు.. నిజమైన థ్రిల్లర్ సినిమా ఓటీటీలో
పోలీసులనే భయపెట్టిన హంతకుడు.. నిజమైన థ్రిల్లర్ సినిమా ఓటీటీలో
Gedela Raju OTT Success Non-Linear Screenplay amp amp Raghu Kunche BGM Win Hearts

'గేదెలరాజు' చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ,ఆహా వేదికలపై విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న క్రేజ్‌తో ఈ వేదికపై అత్యధికంగా రీ-వాచ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. లోకల్ కంటెంట్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఆహా ఓటీటీలో కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

మోటూరి క్రియేషన్స్ బ్యానర్‌పై రఘు కుంచే సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. నూతన దర్శకుడైనప్పటికీ చైతన్య మోటూరి ఎంచుకున్న నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ, కథనంలో చివరి వరకు లీనమయ్యేలా చేసింది.

20 రోజులకే ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే..!
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే..!

'గేదెలరాజు' ప్రధాన పాత్రలో రఘు కుంచే నటన అద్భుతంగా కుదిరింది. తనదైన హావభావాలతో మెప్పించడమే కాకుండా, ఆయన అందించిన పాటలు ,బిజీఎమ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. చిత్రంలో వికాస్, టీనా శ్రావ్య, రామచంద్రం, మోనికా కలపాల, రవి చిన్నిబిల్లి, శ్రీకాంత్ అయ్యంగార్, బాషా, దివ్య మోటూరి తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి కథకు బలమైన మద్దతుగా నిలిచారు. విలక్షణమైన కథనం, గ్రామీణ నేపథ్యం , ఉత్కంఠభరితమైన సంగీతం కోరుకునే ఓటీటీ ప్రియులకు 'గేదెలరాజు' ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+