టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పవర్ ఫుల్ టైటిల్: ఎప్పుడూ చేయని రోల్ లో యంగ్ హీరో

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో మైథలాజికల్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ తెర మీదికి రాబోతోంది. ఇప్పటికే ఇదే జానర్ లో పలు సినిమాలు వచ్చాయి.. మరికొన్ని రాబోతోన్నాయి. ఇప్పుడు మరొకటి తెరకెక్కబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో సెట్స్ పై వెళ్లబోతోంది. ఇందులో కథానాయకుడు ఎవరో కాదు.. వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ భారీ మైథాలాజికల్ యాక్షన్ ఫాంటసీ చిత్రానికి టైటిల్ కూడా ఖరారైంది.

దీనికి ఇంద్రపుత్ర అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు మేకర్స్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, స్టార్ ప్రొడ్యూసర్ ప్రేరణా అరోరా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో ఇదే కాంబినేషన్ లో జటాధర వెలువడింది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో కిరణ్ అబ్బవరంతో మరో ప్రయత్నానికి తెర తీసిందీ బ్యానర్. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్‌లో 15వ చిత్రం.

Indraputra Announced with Kiran Abbavaram Headlines Zee Studios Mythological Universe soon on Floor

ఈ చిత్రానికి శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వం వహించనున్నారు. కీర్తన్ కథను అందించారు. ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయింది కూడా. రెండు భాగాలుగా తెరకెక్కించే అవకాశం ఉంది. పార్ట్ 1 వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు మేకర్లు ప్రకటించారు. ఈ మూవీకి తన్వి ఎన్ దత్తా రచనా సహకారాన్ని అందించారు. స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చుతున్నారు.

కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!
కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!

ఈ గ్రాండ్ మైథాలాజికల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ మొదటి అధ్యాయంలో కిరణ్ అబ్బవరం మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందీ ఫిల్మ్. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూపొందించనున్న ఈ చిత్రాన్ని 2027 లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అడుగడుగునా ఆంక్షలు- అయినా కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు: తగ్గేదే లేదు
అడుగడుగునా ఆంక్షలు- అయినా కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు: తగ్గేదే లేదు

వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తోన్నాడు కిరణ్ అబ్బవరం. క మూవీ నుంచి ఆయన రూట్ మారింది. దిల్ రుబా కాస్త నిరాశపరిచినా కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ హిట్ అయ్యాయి. ఈ దఫా పూర్తి భిన్నమైన మైథాలాజికల్ యాక్షన్ ఫాంటసీ జోనర్‌ను ఎంచుకోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. పురాణ గాథల ఆధారంగా వచ్చే విజువల్ వండర్స్ ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూనే ఉన్నాయి. అదే కోవలోనే సరికొత్త ప్రయోగంగా రాబోతోంది.. ఇంద్రపుత్ర.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+