రూ.లక్షలకు లక్షలు సంపాదిస్తున్న సామాన్య ఇన్‌ఫ్లూయెన్సర్స్

నాణ్యమైన కంటెంట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ, కేవలం ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో లక్షల రూపాయలు ఆర్జిస్తున్న మన దేశపు టాప్ 5 బ్యూటీ, ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ల సంపాదన వివరాల గురించి మనం తెలుసుకుందాం.

1. ఇండియాస్ ఫ్యాషన్ ఐకాన్ - కోమల్ పాండే

ప్రస్తుతం డిజిటల్ ఫ్యాషన్ ప్రపంచంలో కోమల్ పాండే ఒక బ్రాండ్. ఆమె చేసే అద్భుతమైన ఫ్యాషన్ ప్రయోగాలు, సినిమాటిక్ మేకింగ్ స్టైల్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రియేటర్‌గా ఉన్న కోమల్.. ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ బ్రాండ్ కొలాబరేషన్ కోసం అక్షరాలా రూ. 22 లక్షల వరకు వసూలు చేస్తుందని మార్కెట్ టాక్.

Instagram Influencers How Regular People Are Making Lakhs Every Month

2. స్టీరియోటైప్స్ బ్రేక్ చేసిన వీరుడు - అంకుశ్ బహుగుణ

మొదట్లో కేవలం కామెడీ వీడియోలతో నవ్వించిన అంకుశ్.. ఆ తర్వాత పురుషుల మేకప్, బ్యూటీ కంటెంట్‌పై దృష్టి పెట్టి సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేశాడు. ఈ విలక్షణమైన కంటెంట్ వల్లే పెద్ద పెద్ద బ్రాండ్లు ఈయనకు ఒక్కో పోస్ట్‌కు ఏకంగా రూ. 10 లక్షల వరకు ఫీజు ఇస్తున్నాయి.

 ఉపేక్షించవద్దు, సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ కీలక ఆదేశాలు..!!
ఉపేక్షించవద్దు, సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ కీలక ఆదేశాలు..!!

3. జెన్-జీ ఫేవరెట్ - రిదా థరానా

కేవలం ఫ్యాషన్ మాత్రమే కాకుండా లైఫ్‌స్టైల్, రిలేషన్‌షిప్స్, ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచే కంటెంట్‌తో నేటి తరాన్ని బాగా ఆకట్టుకుంటోంది రిదా. ఈమెతో ఒక స్పాన్సర్డ్ పోస్ట్ చేయించాలంటే బ్రాండ్స్ రూ. 8 లక్షల వరకు ఖర్చు చేయాల్సిందే.

4. షార్ట్ వీడియోల క్వీన్ - నగ్మా మిరాజ్కర్

టిక్‌టాక్, రీల్స్ వంటి షార్ట్ వీడియోల ద్వారా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టైల్ కంటెంట్‌తో దూసుకుపోతోంది నగ్మా. ప్రస్తుతం ఈమె క్రేజ్ దృష్ట్యా ఒక బ్రాండెడ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు సుమారు రూ. 7.5 లక్షలు ఛార్జ్ చేస్తోంది.

మహేష్ బాబు మేనకోడలు దెబ్బకి సోషల్ మీడియా షేక్.. పిక్స్ వైరల్ !!
మహేష్ బాబు మేనకోడలు దెబ్బకి సోషల్ మీడియా షేక్.. పిక్స్ వైరల్ !!

5. నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ - శ్రేయా జైన్

బ్యూటీ ఇండస్ట్రీలో మేకప్ ట్యుటోరియల్స్, స్కిన్‌కేర్ టిప్స్‌తో పాటు ప్రొడక్ట్స్ గురించి ఎటువంటి మొహమాటం లేకుండా నిజాయితీగా రివ్యూలు ఇవ్వడం శ్రేయ ప్రత్యేకత. అందుకే బ్రాండ్స్ ఈమెకు ఒక్కో కొలాబరేషన్‌కు దాదాపు రూ. 4 లక్షల వరకు చెల్లిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+