ప్రభాస్ 'రాజాసాబ్' పార్ట్-2 టైటిల్ ఇదే.. సీక్వెలా ? ప్రీక్వెలా ??

పాన్ ఇండియా స్టార్ "ప్రభాస్" నటించిన తొలి హారర్ చిత్రం "ది రాజాసాబ్". జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించగా.. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది. ఓ వర్గం వింటేజ్ ప్రభాస్ ని మళ్లీ చూసే ఛాన్స్ వచ్చిందని ఖుషి అవుతుంటే.. మరో వర్గం మాత్రం ఆశించిన స్థాయిలో లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలను కలిపి రూపొందించిన ఈ మూవీలో ప్రభాస్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించారని అంటున్నారు. వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నప్పటికీ.. కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో సినిమాపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌ ప్రేక్షకులను నిరాశపరిచినట్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ గ్లామర్ మరింత ప్లస్ అయ్యిందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

interesting-details-about-prabhas-rajasaab-part-2-title-and-other-details

రాజాసాబ్ సినిమాకు సీక్వెల్ ఉందని అధికారికంగా ప్రకటించారు. మూవీ క్లైమాక్స్‌లో పార్ట్ 2 కు లీడ్‌తో పాటు, ప్రభాస్‌ను జోకర్ లుక్‌లో చూపించి డబుల్ బొనాంజా ఇచ్చేశారు. ఈ పార్ట్ 2 కి "రాజాసాబ్ సర్కస్: 1935" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. రాజాసాబ్ ట్రైలర్‌లో కనిపించి, సినిమాలో లేని కొన్ని సన్నివేశాలు పార్ట్ 2లో ఉండే అవకాశముందని టాక్ నడుస్తోంది. అలానే 1935 అని ఉండడంతో ఈ చిత్రం సీక్వెల్‌నా లేక ప్రీక్వెల్‌నా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అయితే తొలి భాగమే ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయిన నేపథ్యంలో.. 'రాజాసాబ్ సర్కస్: 1935'కు ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కథ, కథనం బలంగా లేకపోతే స్టార్ ఇమేజ్ ఒక్కటే సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మారుతినే పార్ట్ 2 తెరకెక్కిస్తారా ? కథ ఏ దిశగా సాగుతుంది వంటి విషయాలపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరోవైపు ప్రభాస్ చేతిలో వరుస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాలో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' చిత్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు 'కల్కి 2', 'సలార్ 2' వంటి భారీ సీక్వెల్స్ కూడా రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+