ఆ కుటుంబంతో సంబంధాలు కలుపుకొంటోన్న ఎన్టీఆర్- అత్తా.. అంటూ ఆప్యాయంగా
నేడు.. కేంద్ర మాజీమంత్రి, రాజమండ్రికి చెందిన భారతీయ జనతా పార్టీ లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు బర్త్ డే విషెస్ తెలియజేస్తోన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి పలువురు కేంద్రమంత్రులు గ్రీటింగ్స్ తెలిపారు. సుప్రియా సులే వంటి పలువురు ఎంపీలు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్.. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.
పుట్టినరోజు సందర్భంగా పురంధేశ్వరి రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించారు. పవిత్ర గోదావరి తీరాన వెలసిన మార్కండేయ స్వామి వారిని దర్శించుకొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. సర్వలోకక్షేమం కోసం మార్కండేయ స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె వెంట జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

కాగా- పురంధేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమెను ఉద్దేశించి ఇటువంటి పుట్టినరోజులు అనేకం జరుకోవాలని అత్తా.." అంటూ ట్విట్టర్ చేశారు. ప్రజా సేవ పట్ల అచంచలమైన నిబద్ధతను కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో పురంధేశ్వరి పోషిస్తోన్న పాత్ర దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తున్నాయని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రశంసించారు. అంతకుముందు- చంద్రబాబు పుట్టినరోజు నాడు కూడా ఆయనకు విషెస్ చెప్పారు ఎన్టీఆర్.
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా డ్రాగన్. ఇది వర్కింగ్ టైటిల్. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న మూవీ ఇది. యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ గా ఇది తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో నిమగ్నం అయ్యాడు యంగ్ టైగర్. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 11వ తేదీన విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ మంగళవారమే విడుదల అయింది. దీన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
Many happy returns of the day to Daggubati Purandeswari @PurandeswariBJP garu.
— Jr NTR (@tarak9999) April 22, 2026
Your unwavering commitment to public service, strong leadership, and graceful presence in Indian politics continue to inspire many across the nation Attha…












Click it and Unblock the Notifications