టాలీవుడ్ యంగ్ హీరో క్రీపీ సస్పెన్స్ థ్రిల్లర్.. హతః

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా అవతారం ఎత్తాడు. క.. సినిమాతో రెండేళ్ల కిందట బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకున్న అతను అదే పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. క ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టాడు.

తాజాగా ఇదే ప్రొడక్షన్ బ్యానర్ పై ఓ లేటెస్ట్ క్రేజీ ఫిల్మ్ రాబోతోంది. దీని టైటిల్.. హతః (Hatah). ఓ డిఫరెంట్ సైకలాజికల్ హర్రర్ మిస్టరీ జోనర్ చిత్రం ఇది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్,టైటిల్ గ్లింప్స్ విడుదల అయ్యాయి. వీటిని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు కిరణ్ అబ్బవరం. ఓ నల్లటి పిల్లి, ఓ నాలుగు చేతులు దాని గొంతు నొక్కుతున్నట్టుగా డిజైన్ చేశారీ పోస్టర్ ను. ఈజ్ ద క్యాట్ అలైవ్ ఆర్.. అంటూ ఓ క్యాప్షన్ ను అసంపూర్తిగా వదిలేశారు. దానికిందే హతః అనే టైటిల్ ప్రింట్ అయింది.

Kiran Abbavaram Enters as Producer For New Mystery Horror Thriller Hatah Involves Creepy Suspense

ఈ చిత్రానికి అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రెహమాన్, తనుజా పుట్టస్వామి, కుష్లు మద్దాల (కుష్లుగాడు), నమ్రిత ఎమ్‌వీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ టైటిల్ పోస్టర్, గ్లింప్స్ సినీ ప్రియులలో హైప్ పెంచాయి. ఒక అడ్వాన్స్‌డ్ లెవెల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌, హారర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పెద్దమ్మ చూస్తుంది రా: గ్లింప్సెస్ గూస్ బంప్స్
టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పెద్దమ్మ చూస్తుంది రా: గ్లింప్సెస్ గూస్ బంప్స్

పిల్లి ఇంకా బతికే ఉందా.. లేక చనిపోయిందా? అనే చిక్కుముడి క్యాప్షన్‌తో ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కావడం క్యూరియాసిటీని పెంచింది. ఈ డిఫరెంట్ కంటెంట్ సైన్స్, హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలయికతో సరికొత్తగా సాగుతుందని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కొత్త తరహా కథలు, మైండ్ గేమ్స్ తరహా సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకాదరణ విపరీతంగా పెరిగింది. నిర్మాతగా కూడా కిరణ్ అబ్బవరం రొటీన్ ఫార్ములా చిత్రాల జోలికి పోకుండా, హతః వంటి బలమైన ప్రయోగాత్మక కథలను తెలుగు తెరకు అందించబోతోన్నాడు.

ప్రేక్షకులలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ మిస్టరీ కథనానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనుంది చిత్రం యూనిట్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దర్శకుడు అనుష్ గోరక్ సినిమాను తెరకెక్కించే విధానం, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+