'నమ్మ బెంగళూరు' అంటున్న మహేష్ బాబు.. కొత్త బిజినెస్ షురూ !!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్, బిజినెస్ అంటూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లో ఉన్న ఏఎంబీ (ఏషియన్ మహేశ్ బాబు) సినిమాస్ మల్టీప్లెక్స్ అత్యంత విజయవంతంగా నడుస్తుంది. ఇప్పుడు ఆ బిజినెస్ ని విస్తరించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జనవరి 16న బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ అధికారికంగా ప్రారంభం కానుందని అనౌన్స్ చేశారు. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి 'డాల్బీ సినిమా' ఎక్స్‌పీరియన్స్‌ను ఈ మల్టీప్లెక్స్ అందించనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఈ మేరకు ఆ పోస్టులో.. జనవరి 16న బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ తలుపులు అధికారికంగా తెరుచుకోనున్నాయని రాసుకొచ్చారు. సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ సినిమా అనుభూతిని ఇక్కడ అందించబోతున్నాం. ఇందుకోసం అసాధారణమైన కృషి చేసిన టీమ్ ఏఎంబీకి నా అభినందనలు.. త్వరలోనే 'నమ్మ బెంగళూరు'లో అందరినీ కలుస్తాను" అని పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లో లాగానే బెంగళూరులోనూ ప్రపంచస్థాయి సినిమా వీక్షణ అనుభూతి కోసం ఎదురుచూస్తున్నామంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ "వారణాసి". టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ చిత్రం టైటిల్ అధికారికంగా అనౌన్స్ చేసి.. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అలానే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వగా.. అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను పెంచేశాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు.. ఆధ్యాత్మిక అంశాలతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.












Click it and Unblock the Notifications