మహేష్‌బాబు, వెంకటేష్ కొత్త ప్రాజెక్ట్ ‘AMB ఐమ్యాక్స్’
హైదరాబాద్ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా, టాలీవుడ్ అగ్ర తారలు సరికొత్త థియేట్రికల్ వండర్‌కు శ్రీకారం చుట్టారు. సినిమా హాళ్లకు సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'ఏఎంబీ సినిమాస్' సరికొత్త ఐమాక్స్ స్క్రీన్ ప్రకటనతో టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. హైదరాబాద్‌లో సినిమా చూడటం అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక పెద్ద పండగ. ముఖ్యంగా 'మాస్' సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని 'సుదర్శన్ 70MM' ప్రాంగణం ఇప్పుడు సరికొత్త అంతర్జాతీయ హంగులతో తయారవుతోంది.
రికార్డు సృష్టించనున్న ఐమ్యాక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా, ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా 'AMB క్లాసిక్ విక్టరీ' మల్టీప్లెక్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గతంలో గచ్చిబౌలిలో డాల్బీ సినిమా, బార్కో హెచ్‌డీఆర్ స్క్రీన్స్‌తో సౌత్ ఇండియాలోనే లగ్జరీ మల్టీప్లెక్స్‌గా ఏఎంబీ సినిమాస్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మాస్ ఆడియన్స్‌కు సైతం అందుబాటులోకి తెస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌గా ఈ 'AMB క్లాసిక్ విక్టరీ' రికార్డు సృష్టించబోతోంది. ఈ సరికొత్త ప్రాజెక్ట్‌లో ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల విజువల్ క్వాలిటీ, కంటికి నచ్చేలా క్రేజీ కలర్ కాంట్రాస్ట్, థియేటర్ దద్దరిల్లేలా మైండ్ బ్లోయింగ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఐమాక్స్ విత్ లేజర్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనితో పాటు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా అంతర్జాతీయ స్థాయి ఇంటీరియర్స్, బెస్ట్ ఇన్ క్లాస్ లగ్జరీ సీటింగ్ అమరికలతో ఈ సరికొత్త థియేటర్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.

వారణాసితో ప్రారంభం?
మహేష్ బాబుతో పాటు ఘట్టమనేని, దగ్గుబాటి కుటుంబాలు, ఏషియన్ గ్రూప్ చేతులు కలపడం వల్ల టాలీవుడ్‌లో ఇదొక అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సరికొత్త ఐమాక్స్ లేజర్ స్క్రీన్ నిర్మాణ పనులు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి' విడుదలకు ముందే ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది. రాజమౌళి మార్క్ విజువల్ వండర్‌ను, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐమాక్స్ లేజర్ స్క్రీన్‌పై చూడటం అనేది తెలుగు సినీ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం కాబోతోంది. ఈ 'AMB క్లాసిక్ విక్టరీ' మల్టీప్లెక్స్.. తెలుగు ప్రేక్షకుల సినిమా వీక్షణ అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications