ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్..!

టాలీవుడ్‌లో ప్రస్తుతం డిఫరెంట్ జోనర్స్ వస్తున్నప్పటికీ, ప్రేక్షకులను ఆద్యంతం సీట్లలో కూర్చోబెట్టే క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు లభిస్తున్న క్రేజ్ వేరు. కథాబలంతో పాటు ఊహించని మలుపులు తిరిగే స్క్రీన్‌ప్లే ఉంటే చిన్న సినిమా పెద్ద విజయం సాధిస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ కోవలోనే సరికొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం 'మిస్సింగ్‌ మేఘన'. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ చేశాయి.

Toxic Censor Review: సినిమా టాక్ ఇదే.. హిట్టా..? ఫట్టా..?
Toxic Censor Review: సినిమా టాక్ ఇదే.. హిట్టా..? ఫట్టా..?

యువతి కనిపించకుండా పోవడంతో..

'మిస్సింగ్‌ మేఘన' టైటిల్ చెప్పినట్లుగానే, ఓ యువతి కనిపించకుండా పోవడం మరియు ఆ మిస్టరీని ఛేదించే క్రమంలో జరిగే పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కేవలం ఒక సాధారణ మిస్సింగ్ కేసును చూపించకుండా, దాని వెనుక దాగి ఉన్న మానసిక భావోద్వేగాలు, డ్రామాను జోడించి దర్శకుడు వాచస్పతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్యామ్. కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ థ్రిల్లర్‌కు ప్రధాన బలంగా నిలవగా, ధ్రువన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లో ఉత్కంఠను మరింత పెంచింది.

Missing Meghana Investigation Thriller Movie Details starring Ram Karthik and Ammu Abhirami

వినాయక్ చేతుల మీదుగా లాంచ్

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే వనరాజు అందించగా..పంచుమర్తి నరేష్‌ బాబు నిర్మిస్తున్నారు. రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి, వైదిక సెంజలియా, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌కు ప్రముఖుల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తోంది. సెంసేషనల్ డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా లాంచ్ అయ్యాయి. లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేతుల మీదుగా విడుదలయింది.

ఓటీటీలోకి సూపర్ స్టార్ కృష్ణ మనవడి సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
ఓటీటీలోకి సూపర్ స్టార్ కృష్ణ మనవడి సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

సినిమా లైన్ చాలా ఇన్నోవేటివ్

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ SKN చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్‌పై ఆయన మాట్లాడుతూ.. సినిమా లైన్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ప్రస్తుతం ఆడియన్స్ కొత్త కథలనే ఆదరిస్తున్నారు. టీజర్ చూస్తుంటే సినిమా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది, మీ చిత్రానికి మంచి విజయం తథ్యం అని ప్రశంసించారు. ఓ అమ్మాయి అదృశ్యం వెనుక ఉన్న నిజాలు ఏంటి? ఆ కేసును హీరో ఎలా ఛేదించాడు? అనే ప్రశ్నలకు సమాధానంగా వస్తున్న ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q