ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్.. రిలీజ్‌కి ముందే రూ.350 కోట్లు !

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. 1978లో "తిరనోట్టం" చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో మలయాళంలో సూపర్ స్టార్ గా ఎదిగారు. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ, హిందీ, తెలుగు సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, గాయకుడిగా, థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా టాలెంట్ నిరూపించుకున్నారు.

ఇక రీసెంట్ గానే ఆయన నటించిన ఎంపురాన్, తుడరమ్ చిత్రాలు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. కొద్ది నెలల క్రితమే మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన "కన్నప్ప" చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అంతకు ముందు తెలుగులో జనతా గ్యారేజ్ సినిమాలో నటించి మెప్పించారు. ఇప్పటికే జాతీయ ఉత్తమ నటుడిగా పలుమార్లు అవార్డు అందుకున్న ఆయనను.. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కొద్దిరోజుల క్రితమే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సైతం అందుకున్నారు.

mohanlal-drushyam-3-movie-got-record-in-getting-350-crores-pre-release-business

ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న చిత్రం "దృశ్యం 3". జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 'దృశ్యం' మూవీ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా రాబోతుంది. తొలి రెండు భాగాలు భారీ విజయం సాధించడంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు రాబోతున్న ఈ థర్డ్ పార్ట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో ఎన్నడూ లేని రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని నిర్మాత ఎం. రంజిత్ ఒక ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడించారు. "దృశ్యం 3" ఇప్పటికే రూ.350 కోట్ల ప్రీ-బిజినెస్ సాధించినట్టు తెలిపారు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో నిర్మాణ దశలో ఉన్న ఒక సినిమా ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ చేయడం ఇదే మొదటిసారి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఫ్రాంచైజీకి ఉన్న పాపులారిటీ వల్ల ఈసారి రీమేక్ హక్కులు అమ్మకుండా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఆ కారణంగానే పాన్ ఇండియా రిలీజ్ దృష్టిలో పెట్టుకొని ఇంత బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు.

mohanlal-drushyam-3-movie-got-record-in-getting-350-crores-pre-release-business

దృశ్యం స్టోరీ..

ఈ చిత్రంలో జార్జ్‌కుట్టి ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. భార్య ఇద్దరు కూతుర్లతో కలిసి జీవిస్తుంటారు. అనుకొని ఆపద వచ్చిన సమయంలో తన కుటుంబం కోసం ఎంత వరకు వెళ్లాడు.. ఏ పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను అలరించాయి. దాంతో ఇప్పుడు ఈ పార్టులో ఏం జరగబోతుంది అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+