నాగార్జునకు బాగా నచ్చిన బాలకృష్ణ సినిమా
అక్కినేని నాగార్జునకు నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాల్లో 'ఆదిత్య 369' సినిమా అంటే అత్యంత ఇష్టం. 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్‌గా నిలిచింది. పలు వేదికలపై, ఇంటర్వ్యూలలో నాగార్జున ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 1990ల కాలంలోనే 'టైమ్ మిషన్' ఆధారంగా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో సినిమా తీయడం అప్పట్లో ఒక పెద్ద సాహసం.
భారతీయ సినిమాలో అలాంటి సరికొత్త ప్రయోగాన్ని ధైర్యంగా చేసి విజయం సాధించినందుకు ఈ సినిమా నాగార్జునను ఎంతగానో ఆకట్టుకుంది. కాలాన్ని వెనక్కి, ముందుకు తీసుకెళ్లే కథనాన్ని పౌరాణిక, చారిత్రక అంశాలతో ముడిపెట్టి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మలిచిన తీరు ఆయనకు బాగా నచ్చింది.

బాలయ్య నటనలో వైవిధ్యం
ఈ చిత్రంలో బాలకృష్ణ నటన, ముఖ్యంగా ఆయన చూపిన వైవిధ్యం నాగార్జునకు ఎంతో నచ్చిన మరో ముఖ్యమైన అంశం. వర్తమానంలో ఉండే ఆధునిక యువకుడిగా, అలాగే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ ఒదిగిపోయిన తీరును నాగార్జున విశేషంగా ప్రశంసించారు. రాయలవారి పాత్రలో బాలకృష్ణ గంభీరమైన రాజసంతో పాటు ఆయన పలికించిన పద్యాలు, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటాయని చెప్పారు.
ఇళయరాజా సంగీతం కూడా
అంతేకాకుండా, ఇళయరాజా అందించిన అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని నాగార్జున పేర్కొన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలి టైమ్ ట్రావెల్ చిత్రాల్లో ఒకటి నిలిచిన 'ఆదిత్య 369' బాలకృష్ణ కెరీర్‌లోనే కాకుండా, తనకిష్టమైన తెలుగు చిత్రాల్లో ఎప్పటికీ ప్రత్యేకమైనదిగా ఉంటుందని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 చేయాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నారు. దానికి దర్శకత్వం కూడా బాలయ్యే చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో తనతోపాటు తన కుమారుడు మోక్షజ్ఞను కూడా నటింపచేయాలని భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications