ప్రభాస్ "స్పిరిట్" ఫస్ట్ లుక్ పోస్టర్లో ఇది గమనించారా..?
గ్లోబల్ స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం స్పిరిట్'. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్. అంతే కాకుండా సందీప్ గత చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని జోరుగా చర్చ నడుస్తోంది.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా యానిమల్ ఫేమ్ " త్రిప్తి డిమ్రి " నటించనుంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. రీసెంట్ గానే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా వాయిస్ నోట్ రిలీజ్ చేయగా ఫుల్ వైరల్ అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి అభిమానులు సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లో సైతం ఫుల్ బజ్ నెలకొంది. దాంతో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, ఏఐ ఫోటోలతో సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చ లేపుతున్నారు.

ఇప్పుడు లేటెస్ట్ గా న్యూ ఇయర్ సందర్భంగా మూవీ యూనిట్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఈ సినిమా ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసింది. డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.
అందులో "భారతీయ సినిమా.. మీ అజానబాహుడిని (AJANUBAHU) వీక్షించండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్లో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఓ కిటికీ దగ్గర నిల్చొని ఉండగా.. త్రిప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. చేతిలో మందు బాటిల్ గమనించవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఫుల్ వైరల్ అవుతోంది.
అయితే ఇప్పటికే రిలీజ్ చేసిన వాయిస్ నోట్ లో ప్రభాస్ ని అరెస్ట్ చేసి జైలుకి తరలించినట్టు.. అక్కడ ప్రకాష్ రాజ్ సంభాషణను రివీల్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తుంటే జైల్లో ప్రభాస్ ని కొట్టి టార్చర్ చేసిన తర్వాత రిలీజ్ అవ్వడం. ఆ తర్వాత వచ్చే సీన్ లాగా అనిపిస్తుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక మరోవైపు ప్రభాస్ మారుతితో రాజాసాబ్ .. హను రాఘవపూడి దర్శకత్వంలో "ఫౌజీ" సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో కల్కి - 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2 చేయనున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications