ప్రభాస్ చీర గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్.. అంతకు ముందు చేసిన సినిమాలు ఏవంటే..?
గ్లోబల్ స్టార్ ప్రభాస్.. తెలుగు హీరోగా సినీ ప్రస్థానం ఆరంభించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. బాహుబలి, సలార్, కల్కి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మారుతితో "రాజా సాబ్" సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈసారి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ప్రభాస్ రాజాసాబ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు.. భర్త మహాశయులకి విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో రాజాసాబ్ మూవీ టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ రిద్ది కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రభాస్ చీర గిఫ్ట్..
ప్రభాస్ మూడు సంవత్సరాల క్రితం చీరను బహుమతిగా ఇచ్చారని హీరోయిన్ రిద్ధి వ్యాఖ్యానించింది. అది తనకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పారు. ఆ ప్రత్యేకతను గుర్తు చేస్తూ.. ఇప్పుడు ధరించి ఈవెంట్‌కు హాజరైనట్లు వెల్లడించారు. ప్రభాస్ తో కలిసి నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
రిద్ధి ఫిల్మ్ కెరీర్..
రిద్ది కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో రాజ్ తరుణ్ "లవర్" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంలో మెప్పించింది. తెలుగులోనే కాకుండా మలయాళం, మరాఠీ చిత్రాల్లో కూడా నటించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా మహారాష్ట్రలోని పుణేలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. ఫెర్గ్యూసన్ కాలేజ్ నుంచి ఉన్నత విద్యను పూర్తి చేసి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.













Click it and Unblock the Notifications