డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్

తెలుగులో అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత స్థానంలో రాజశేఖర్ ఉండేవారు. ఒకానొక సమయంలో టాప్ స్థానానికి కూడా దూసుకువచ్చి చిరంజీవితో పోటీపడ్డారు. అటువంటి యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ కేవలం ఒక డబ్బింగ్ సినిమా ద్వారా తమిళంలోకి వెళ్లి, రజనీకాంత్ రికార్డులను బద్ధలుకొట్టేసి సంచలన రికార్డులను సాధించారు. తెలుగులో రాత్రికి రాత్రే రాజశేఖర్ ను సూపర్ స్టార్ చేసిన సినిమా అంకుశం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం.ఎస్.రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి దీన్ని నిర్మించారు. బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఈ సినిమా బద్దలు కొట్టింది.

రికార్డులన్నీ బద్దలే

'అంకుశం' షూటింగ్ జరుగుతున్నప్పుడే, ఆ సినిమా కంటెంట్ మీద రాజశేఖర్‌కు విపరీతమైన నమ్మకం ఏర్పడింది. దీంతో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నుంచి తమిళ డబ్బింగ్ రైట్స్‌ను తానే సొంతంగా కొనుగోలు చేశారు. తెలుగులో సినిమా బ్లాక్ బస్టర్ అవగానే, తమిళ డబ్బింగ్ రైట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. రూ. 3 లక్షలతో మొదలైన ఆఫర్, ఏకంగా రూ. 25 లక్షల వరకు వెళ్లినా రాజశేఖర్ తగ్గలేదు. తానే సొంతంగా తమిళంలో విడుదల చేసి, అప్పట్లో అక్కడ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డులను సైతం బద్దలు కొట్టి సంచలనం సృష్టించారు. అంతేకాదు.. కన్నడలో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది. హిందీలో 'ప్రతిబంద్' పేరుతో మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్‌లో తొలిసినిమా అయింది.

Rajasekhar shattered superstar Rajinikanth records in Tamil Nadu with a dubbed film release

ఆత్మవిశ్వాసంతో రాజశేఖర్

చాలా కాలం తర్వాత రాజశేఖర్ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడానికి 'బైకర్' సినిమాతో వస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ చిత్రంపై ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ బుల్లెట్ సునీల్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ఈ కథ విన్నప్పుడు నమ్మకం కలిగిందని, ఆడియన్స్ ఈ పాత్రను ఎంతలా మెచ్చుకుంటారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు. రాజశేఖర్‌కు పర్సనల్‌గా బైక్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఊర్లో బుల్లెట్ బండిపై తిరిగిన జ్ఞాపకాలే ఈ సినిమా చేయడానికి స్ఫూర్తి అని ఆయన తెలిపారు.

ఒక ఆసక్తికరమైన జ్ఞాపకాన్ని పంచుకుంటూ.. 'శేషు' సినిమా సమయంలో ఆయన స్వయంగా ఒక యమహా 650 CC బైక్ కొన్నారు. అయితే షూటింగ్‌లో ఆయన ఆ బైక్‌ను చాలా వేగంగా, రిస్క్ తీసుకుని నడపడం చూసి భయపడిన భార్య జీవిత, ఆయనకు తెలియకుండానే ఆ బైక్‌ను అమ్మేశారట! ఆ విషయాన్ని రాజశేఖర్ చెబుతూ సరదాగా నవ్వుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+