హీరోగా ఆర్జీవీ - విలన్‌గా టాలీవుడ్ హీరో.. టైటిల్ నెక్స్ట్ లెవెల్ !
రామ్ గోపాల్ వర్మ.. ఈ సంచలన దర్శకుడి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా "శివ" చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. 1990లో విడుదల అయిన ఈ మూవీ తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఆ తర్వాత 'క్షణక్షణం', 'గాయం', 'రాత్రి', 'అంతం' వంటి సినిమాలతో ఆడియన్స్ ని టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత బాలీవుడ్కి మకాం మార్చిన ఆర్జీవీ.. 1998లో 'సత్య' చిత్రంతో హిందీ ఆడియన్స్ ని పలకరించారు. ఆ మూవీతోనే గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. అలానే ఆయన డైరెక్షన్ లో వచ్చిన 'కంపెనీ', 'రోడ్', 'రన్', 'సర్కార్' వంటి చిత్రాలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్‌తో తీసిన 'సర్కార్' ఆయన కెరీర్‌లో ఒక హైలైట్‌గా నిలిచింది. కాగా అటు సినిమాల తోనే కాకుండా వివాదాల తోనూ నిత్యం వార్తల్లో నిలుస్తారు ఆర్జీవీ. సోషల్ మీడియాలోనూ, టీవి ఇంటర్వ్యూల లోనూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా, ఓపెన్ గా వ్యక్తపరుస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు.

ఇక గత కొంతకాలంగా వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడు లాగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటున్నారు. అయితే ఎప్పుడూ తెర వెనుకే ఉండే వర్మ.. ప్రభాస్ - నాగ్ అశ్విన్ "కల్కి" సినిమా కోసం మాత్రం అతిథి పాత్రలో తెర మందుకు వచ్చారు. ఉన్నది కొంచెం సేపు అయినా కూడా తన మార్క్ మేనరిజంతో అలరించారు. కానీ ఇప్పుడు ఏకంగా కంప్లీట్ గా రూట్ మార్చేశారు ఆర్జీవీ. దీంతో ఈ వ్యవహరం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
హీరోగా వర్మ..
రామ్ గోపాల్ వర్మ హీరోగా సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి "షో మ్యాన్" అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. "మ్యాడ్ మోన్‌స్టర్ " అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అంతే కాకుండా నటుడు సుమన్ ఈ మూవీలో విలన్‌గా చేయబోతుండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో "నూతన్" అనే కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.
వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన.. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి ఈ కొత్త సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని.. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాత వెల్లడించారు.
#RamGopalVarma making his acting debut in a full fledged lead role with #Showman - Mad Monster pic.twitter.com/BIPSxQUzkh
— Sai Satish (@PROSaiSatish) December 5, 2025
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?












Click it and Unblock the Notifications