ఇదే ఉద్యోగం కాదు.. ఆ బ్యాచ్ మొత్తానికి రానా స్ట్రాంగ్ కౌంటర్ !!
చిత్రపరిశ్రమలో ప్రస్తుతం తీవ్రవివాదాస్పదంగా మారిన విషయం పని గంటలు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇటీవల "రోజుకు ఎనిమిది గంటల పని' అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రసవం తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఎంతో కష్టమని.. ఆరోగ్యం ముఖ్యమైతే ఎనిమిది గంటల పని సరిగా చేస్తే చాలు. అతిగా వర్క్ చేయడం మంచిది కాదు అని స్పష్టం చేశారు. ఈ కారణం వల్లే ఆమెను స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి మేకర్స్ తొలగించారు.
దీంతో మిగతా రంగాల తరహాలోనే ఇండస్ట్రీలోనూ నిర్ణీత పని గంటలు ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలోనే దీపికా వ్యాఖ్యలకు పలువురు హీరోయిన్స్ సైతం మద్దతు తెలుపుతూ మాట్లాడారు. మరికొందరు మాత్రం ఆమె కామెంట్స్ ఖండిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ వ్యవహారంపై పరోక్షంగా స్పందించారు. ఈ క్రమంలోనే హాట్ కామెంట్స్ చేయడం సినీవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

రానా ఏమన్నారంటే..
మిగతా రంగాలతో పోలిస్తే సినిమా రంగం భిన్నమైందని రానా గుర్తుచేశారు. నటన అంటే ఉద్యోగం కాదని.. ఇన్ని గంటలే చేయాలని నిర్వచించడం కష్టమని రానా చెప్పుకొచ్చారు. రోజుకు 8 గంటలు కదలకుండా కూర్చొని పనిచేస్తే అద్భుతమైన ఔట్ పుట్ రావడానికి యాక్టింగ్ అనేది ప్రాజెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. నటన అనేది ఓ లైఫ్ స్టైల్ అని.. నటులు దీనిని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. ఈ లైఫ్ స్టైల్ కొనసాగించాలా? వద్దా? అనేది పూర్తిగా ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందేనని చెప్పారు.
అంతే కాకుండా సినిమా ఒక టీమ్ కట్టుబాటుపై ఆధారపడి ఉంటుందని.. అందరూ కలిసి అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒక గొప్ప సీన్ రావాలంటే కెమెరా నుంచి లైటింగ్ వరకు, నటీనటుల నుంచి టెక్నీషియన్ల వరకూ అందరూ సమయం పట్టించుకోకుండా పనిచేయాలన్నారు. ఇక్కడ 8 గంటల రూల్ పెట్టేయడం ప్రాక్టికల్‌గా కరెక్ట్ కాదని రానా అభిప్రాయపడ్డారు.
దుల్కర్ సల్మాన్ రియాక్షన్..
అలానే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. తెలుగు, మలయాళం, తమిళ ఇండస్ట్రీలో తన వర్క్ ఎక్స్ పీరియన్స్ గురణచి చెబుతూ.. మళయాళంలో ఉదయం షూటింగ్ ప్రారంభమయ్యాక ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదన్నారు. తమిళ ఇండస్ట్రీలో మాత్రం నటీనటులకు ప్రతి నెలా రెండు ఆదివారాలు సెలవు ఇస్తారని వివరించారు. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే.. మహానటి సినిమా షూటింగ్ సమయంలో కొన్నిసార్లు తాను సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ఒకేరోజు అతిగా పనిచేయడం కంటే.. రోజూ కొంచెం అదనంగా పనిచేయడం బెస్ట్ అని వెల్లడించారు.
-
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !!












Click it and Unblock the Notifications