ధురంధర్ స్టార్ హీరో పీకకు చుట్టుకున్న వివాదం
బాలీవుడ్ సూపర్ స్టార్, ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంతార: ఏ లెజెండ్ - చాప్టర్ 1 చిత్రంలో ఓ సన్నివేశాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు, హీరో రిషభ్ షెట్టిని వెక్కిరించడానికి సంబంధించి నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని తక్షణమే విచారణలోకి తీసుకోవాలని ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. సెలెబ్రిటీ అయినంత మాత్రాన ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండబోదని వ్యాఖ్యానించింది.
రిషభ్ షెట్టిని వెక్కిరిస్తూ ఫొటోలకు ఫోజు ఇవ్వడం పట్ల రణ్‌వీర్ సింగ్ పై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. హిందూ మతపరమైన మనోభావాలు, కర్ణాటక తీరప్రాంత చాముండి దైవ సంప్రదాయాన్ని కించపరిచారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. బీఎన్ఎస్ లోని సెక్షన్లు 196, 299, 302 కింద బెంగళూరుకు చెందిన అడ్వొకేట్ ప్రశాంత్ మెథాల్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు.

గత ఏడాది నవంబర్ 28న గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పంజుర్లి, గుళిగ దేవుళ్ల హావభావాలను అసభ్యకరంగా, హాస్యాస్పదంగా అనుకరించారని మెథాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన చాముండి దైవాన్ని ఆడదెయ్యం అని రణ్‌వీర్ సింగ్ అభివర్ణించారని తెలిపారు. చాముండి అమ్మవారిని కోస్టల్ కర్ణాటక ప్రాంత ప్రజలు నిత్యం పూజిస్తారని, దివ్య శక్తికి ప్రతీకగా భావిస్తారని స్పష్టం చేశారు.
అలాంటి శక్తిమంతమైన అమ్మవారిని దెయ్యంగా చిత్రీకరించడం భక్తుల మనోభావాలను గాయపరిచిందని పేర్కొన్నారు. ఈ చర్య ఉద్దేశపూర్వకం, ద్వేషపూరితమైనదని, మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, సమాజంలో విద్వేషాన్ని ప్రోత్సహించినట్టవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు బెంగళూరులోని ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ దశలో ఉంది. తదుపరి విచారణ ఏప్రిల్ 8న జరగనుంది.
దీన్ని కొట్టివేయాలంటూ తాజాగా రణ్‌వీర్ సింగ్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ తాజాగా న్యాయమూర్తి ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. రిషబ్ షెట్టి నటన, పాత్ర ఔచిత్యం, ఆ చిత్రాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించడానికే తాను అలా చేశానని, ఇతర ఎటువంటి దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, నేరపూరిత కోణాన్ని ఆపాదించారని రణ్‌వీర్ సింగ్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే రెండు నోటీసులు జారీ చేశారని, అనవసర ఒత్తిడిని రణ్‌వీర్ ఎదుర్కొంటున్నారని పిటిషన్‌లో వివరించారు. ఈ కేసును అత్యవసరంగా విచారణకు స్వీకరించాలన్న అతని తరపు న్యాయవాది అభ్యర్థనపై విచారణ సందర్భంగా కోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. బాలీవుడ్ నటుడు కాబట్టి ఈ_విషయాన్ని అత్యవసరంగా చేపట్టాలా అని న్యాయమూర్తి నాగప్రసన్న ప్రశ్నించారు. అప్పటికప్పుడు విచారించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. సాధారణ ప్రక్రియలనే అనుసరించాలని నిర్ణయించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications