ఉదయనిధి స్టాలిన్ బెయిల్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. తంజావూర్ పోలీసులు చెన్నై, నీలాంగరైలోని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తన అరెస్ట్ పైన హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి.. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. విచారణ చేసిన న్యాయస్థానం ఉదయనిధిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశిస్తూ.. బెయిల్ మంజూరు చేసింది.
ఈ ఉదయం నుంచి చెన్నై కేంద్రంగా హైడ్రామా చోటు చేసుకుంది. తంజావూరులో జరిగిన కావేరి జలాల నిరసన సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా 'త్రిష.. త్రిష' అని నినాదాలు చేశారు. దానికి ఉదయనిధి స్టాలిన్ నవ్వుతూ.. హీరోయిన్ త్రిష, సీఎం విజయ్‌లను ఉద్దేశించి అనుచితమైన డబుల్ మీనింగ్ కామెంట్లు చేశారు.

ఉదయనిధి స్టాలిన్ కామెంట్లపై టీవీకే పార్టీ మహిళా విభాగం తంజావూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తంజావూర్ పోలీసుల బృందం చెన్నై పోలీసుల సాయంతో నీలాంగరైలోని నివాసం వద్ద తంజావూర్ పోలీసులు ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేశారు.
దీంతో, ఒక్క సారిగా డీఎంకే శ్రేణులు నిరసనలకు దిగారు. మాజీ సీఎం స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత బంద్ నిర్వ హణ కు డీఎంకే ప్రయత్నం చేసింది. తాను ఎలాంటి దురుద్దేశ పూర్వక వ్యాఖ్యలు చేయలేదని.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి చెప్పుకొచ్చారు. అటు డీఎంకే కార్యకర్తలు ఉదయ నిధి అరెస్ట్ పైన హర్షం వ్యక్తం చేసారు.
త్రిషకు మద్దతుగా రంగంలోకి కొందరు హీరోయిన్లు మద్దతు వ్యాఖ్యలు చేసారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టారు. కాగా.. కోర్టులో బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో తమకు ఉదయనిధిని కస్టడీలో ఉంచే ఆలోచన లేదని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. ఉదయనిధిని వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తూ.. విచారణకు సహకరించాలని ఉదయనిధికి స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications