సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని డామినేట్ చేసిన దురంధర్: టాలీవుడ్ టాప్ దర్శకుడు

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోన్న దురంధర్ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసించాడు. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ మూవీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని భయానికి గురి చేసిందని, ఒక్క దెబ్బతో తరిమికొట్టిందని వ్యాఖ్యానించాడు. హీరో ఎలివేషన్ కే పరిమితమైన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితబోధ చేశాడు. రణ్ వీర్ సింగ్ కథలో లీనం అయ్యాడని, క్యారెక్టర్ తప్ప యాక్టర్ కనిపిండని వ్యాఖ్యానించాడు.

రణ్ వీర్ సింగ్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,050 కోట్లు కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ హయ్యెస్ట్ గ్రాస్ ను కలెక్ట్ చేస్తుందని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. సౌత్ ఇండియన్ చిత్రాలు హీరో ఎలివేషన్‌పై దృష్టి పెట్టి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దేవుడిలా చూపిస్తాయని, ధురందర్ లో హీరోను ఓ క్యారెక్టర్ గా మాత్రమే చూడొచ్చని చెప్పాడు. రణ్ వీర్ సింగ్ కథలో లీనం అయ్యాడని, విలన్లతో సహా అన్ని పాత్రలు కూడా హీరోతో సమానంగా పోటీ పడ్డాయని అన్నారు.

RGV Calls Dhurandhar a Masterclass In Scale and Heroism 2nd Part Will Terrify South Cinema

దక్షిణాది నుండి వచ్చే పాన్ ఇండియా మూవీలు స్టైలిష్, ఫార్ములా యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువగా ఆధారపడతాయని ఆర్జీవీ చెప్పారు. ఈ సంప్రదాయాన్ని ధురందర్ విచ్ఛిన్నం చేసిందని, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో చాలా సహజంగా చిత్రీకరించడం ద్వారా ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించిందని ఆయన అన్నారు. "ఈ సినిమాలో ఎవరూ గాల్లోకి ఎగరట్లేదు, ఒకే దెబ్బకు అయిదుమంది ఎగిరి పడటం లేదు. ఇది దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ నిజంగా జరిగేలా అనిపిస్తాయి. దీని తర్వాత మనం రెగ్యులర్ యాక్షన్ సీన్లు చేస్తే హాస్యాస్పదంగా కనిపిస్తాయి" అని వర్మ వివరించారు.

మార్చిలో విడుదల కానున్న ధురందర్ 2 సౌత్ సినిమాకు మరింత భయాన్ని కలిగిస్తుందని ఆయన ఆర్జీవీ చెప్పారు. బాలీవుడ్‌పై సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆధిపత్యాన్ని దురంధర్ తన ఎడమ కాలితో తరిమి కొట్టిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అతని కుడి కాలు 'ధురందర్ 2'తో సిద్ధంగా ఉందని, మొదటి భాగం వారిని భయపెడితే, రెండవది మరింత వణుకుపుట్టిస్తుందని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

హీరో ఓ మంచి కారణం కోసం వెళ్లడం, ఆపదలో పడటం, అమ్మాయితో ప్రేమలో పడటం, ఓ విలన్, ఫ్లాష్‌బ్యాక్‌లు, ప్రతీకారం- ఇవన్నీ టెంప్లేట్ లో భాగమే అయినప్పటికీ దాని అసలు బలం లీనమయ్యే కథాకథనం, పాత్రల పట్ల పక్షపాతం లేని విధానం, అపూర్వమైన యాక్షన్ సెట్ పీసెస్‌లో ఉందని ఆర్జీవీ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+