మాజీ మంత్రి రోజా లగ్జరీ కార్ల సామ్రాజ్యం గురించి తెలుసా?

వెండితెరపై టాప్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగి, రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్‌గా నిలిచిన ఆర్కే రోజా లైఫ్‌స్టైల్ ఎప్పుడూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్న ఆమె ఆస్తుల వివరాలు, ముఖ్యంగా ఆమె గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు.. ఇలా మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆమె కార్ల నెట్‌వర్క్, బంగారం, మొత్తం ఆస్తుల వివరాలు తెలుసుకుందాం.

కొడుక్కి రూ. 1.50 కోట్ల బెంజ్ గిఫ్ట్!

రోజా మంత్రిగా ఉన్న సమయంలో తన కుమారుడు కృష్ణ కౌశిక్‌కు ఒక ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. అదే మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డి. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.1.50 కోట్లు. మంత్రి పదవిలోకి రాగానే ఇంత భారీ విలువైన కారు కొనడంపై అప్పట్లో తీవ్ర రాజకీయ విమర్శలు వచ్చాయి. అయితే, వీటన్నింటికీ రోజా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నేను మంత్రి కాకముందే నా వద్ద చాలా కార్లు ఉన్నాయి. ఇవన్నీ నేను హీరోయిన్‌గా సంపాదించిన డబ్బుతో, టీవీ షోల ద్వారా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసినవే. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, ఆ అవసరం నాకు లేదు అని చెప్పారు.

Roja Take A Look At the list of cars owned by Former Minister and YSRCP Leader

రోజా గ్యారేజీలో ఏ కార్లు ఉన్నాయంటే

రోజా ఫ్యామిలీ వద్ద మొత్తం 10 కి పైగా వాహనాలు ఉన్నాయి. కేవలం వీటి మార్కెట్ విలువే రెండు కోట్ల రూపాయలకు పైమాటే! ఆమె అఫిడవిట్ ప్రకారం ఉన్న ఆ కార్ల మోడల్స్, రిజిస్ట్రేషన్ వివరాలు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ కార్లు

మహింద్రా XUV500 (2013 మోడల్)
మహింద్రా స్కార్పియో (2015 మోడల్)
టయోటా ఫార్చ్యూనర్ (2018 మోడల్)
ఫోర్డ్ ఎండీవర్ (2020 మోడల్)
మెర్సిడెజ్ బెంజ్ - సికెడి ఎక్స్167 (2022 మోడల్)
ఇసుజు డి-మ్యాక్స్ క్రూ (2019 మోడల్)
చెవర్లే క్రూజ్ (2010 మోడల్)

తెలంగాణ & తమిళనాడు రిజిస్ట్రేషన్స్

టయోటా ఇన్నోవా క్రిస్టా (2017 మోడల్)
ఫోర్డ్ ఎండీవర్ (2007 మోడల్)
టయోటా ఇన్నోవా (2012 మోడల్) - రోజా భర్త సెల్వమణి పేరిట ఉన్న తమిళనాడు రిజిస్ట్రేషన్ కారు.

కిలోన్నర బంగారం.. కోట్ల ఆస్తులు!

కేవలం కార్లే కాదు, రోజా ఫ్యామిలీకి ఉన్న బంగారం, ఆస్తుల విలువ కూడా భారీగానే ఉంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వారి దగ్గరున్న గోల్డ్ కలెక్షన్ వివరాలు పరిశీలిస్తే.. రోజా 986 గ్రాములు, భర్త సెల్వమణి 485 గ్రాములు, పిల్లలు190 గ్రాములు. మొత్తం బంగారం1.66 కేజీలు (రూ. 1.50 కోట్లకు పైగా విలువ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+