యూట్యూబ్‌లో రఫ్ఫాడిస్తున్న సమంత
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు వెడ్డింగ్, ఫెస్టివల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే మాస్ ఎనర్జిటిక్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. పెళ్లిళ్లు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చుట్టూ తిరిగే పాటలు ప్రేక్షకులకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతాయి. సరిగ్గా ఇదే ఫార్ములాతో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. సామ్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం'. ఈ చిత్రంలోని 'తస్సదియా' వెడ్డింగ్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ రచ్చ చేస్తోంది.
29 మిలియన్ల వ్యూస్
ఏప్రిల్ 16న విడుదలైన ఈ క్రేజీ సాంగ్, రిలీజైన నాటి నుండి దాదాపు 69 రోజులుగా ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది. కేవలం యూట్యూబ్‌లోనే ఈ పాట ఏకంగా 29 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టి 2026 బిగ్గెస్ట్ ట్రెండింగ్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ సాంగ్ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటివరకు 25 వేలకు పైగా రీల్స్‌తో నెటిజన్లు ఈ ట్యూన్‌కు స్టెప్పులేస్తూ రచ్చ చేస్తున్నారు. సింపుల్ అండ్ ఫన్నీగా ఉండే ఈ సాంగ్ సిగ్నేచర్ స్టెప్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

స్టార్ల కాంబో.. అదిరిపోయే పవర్‌ఫుల్ ప్యాకేజ్
'తస్సదియా' సాంగ్ ఇంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం వెనుక సౌత్ సినిమాలోని టాప్ టాలెంట్స్ ఉన్నారు. స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ తనదైన మోడ్రన్ బీట్స్‌తో ఈ ట్రెడిషనల్ వెడ్డింగ్ ట్రాక్‌కు అదిరిపోయే హై-వోల్టేజ్ ఎనర్జీని ఇచ్చారు. లిరిసిస్ట్ రెహమాన్ క్యాచీ లైన్స్ రాయగా.. ఫేమస్ సింగర్స్ చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ తమ బ్యూటిఫుల్ అండ్ పవర్‌ఫుల్ వాయిస్‌తో ఈ పాటను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు.
బాక్సాఫీస్ వద్ద 'మా ఇంటి బంగారం' జాతర!
నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సమంతతో పాటు గౌతమి, దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. కేవలం పాటలతోనే కాకుండా కంటెంట్‌తోనూ థియేటర్లలో ఈ సినిమా దూసుకుపోతోంది. రూ.25 కోట్ల నుండి రూ.40 కోట్ల రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, రిలీజైన కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.46 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద సమంత సత్తాను మరోసారి నిరూపించింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న 'మా ఇంటి బంగారం' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications