పోలీసులనే భయపెట్టిన హంతకుడు.. నిజమైన థ్రిల్లర్ సినిమా ఓటీటీలో
ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా స్టార్ట్ చేసిన థ్రిల్లర్ సినిమాలు మైండ్ బ్లాంక్ అయ్యే అనుభవాన్ని ఇస్తుంటాయి. సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్'. కన్నడలో ఈ ఏడాది రూపొందిన బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లలో ఒకటైన ఈ సినిమా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతూ థ్రిల్లర్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కథలోకి వెళ్తే..
శివమొగ్గ జిల్లాలోని అనెగద్దే పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ సీతారామ్ (విజయ్ రాఘవేంద్ర) ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. క్రైమ్ రేట్ తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఒకరోజు సంచలన హత్య జరుగుతుంది. సమాచారం అందుకుని సీతారామ్ తన టీమ్‌తో క్రైమ్ సీన్‌కు చేరుకోగా.. అక్కడ విజువల్స్ చూసి పోలీసులకే ముచ్చెమటలు పడతాయి. రెండు కాళ్లు, చేతులను ఇనుప ముళ్ల కంచెలతో దారుణంగా కట్టేసి, అత్యంత క్రూరంగా ఒకరిని హత్య చేసి ఉంటాడు ఆ సైకో కిల్లర్.

ఆ భయంకరమైన హత్య వెనుక ఉన్న ఆధారాలు వెతికే లోపే.. సరిగ్గా అదే తరహాలో వరుసగా మరో మూడు హత్యలు జరుగుతాయి. హత్యల శైలిని బట్టి ఇవన్నీ చేస్తున్నది ఒక్కడేనని గ్రహించిన సీతారామ్, హంతకుడిని పట్టుకోవడానికి సీరియస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఇంతకీ ఆ సైకో కిల్లర్ ఎవరు? ఆ హత్యల వెనుక ఉన్న అసలు మోటివ్ ఏంటి? సీతారామ్ ఆ హంతకుడికి ఎలా చెక్ పెట్టాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే?
సినిమా ప్రారంభంలో కాస్త నార్మల్‌గా సాగినా, మొదటి హత్య జరిగిన క్షణం నుండి కథ ఐదో గేర్‌లోకి మారుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్క్రీన్‌ప్లే అత్యంత క్రిస్పీగా, ఊపిరి బిగబెట్టేలా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు ఇచ్చే బ్యాంక్, ఆ ట్విస్ట్ వేరే లెవెల్‌లో ఉంటాయి. కథ పరంగా ఇది ఒక రెగ్యులర్ రివేంజ్ డ్రామానే అయినప్పటికీ, దర్శకుడు దేవి ప్రసాద్ శెట్టి దానిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేసిన తీరు ప్రశంసనీయం. కథనంలో వచ్చే ట్విస్ట్‌లు నెక్స్ట్ ఏం జరగబోతోందో ఊహించనివ్వవు. విజయ్ రాఘవేంద్ర తన సిన్సియర్ పోలీస్ యాక్టింగ్‌తో సీతారామ్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
గోపాల కృష్ణ దేశ్‌పాండే, సాగర్ పురానిక్ తదితరుల నటన కూడా ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదించి, కథను కొంత డీవియేట్ చేసినట్లు అనిపించినా.. ఓవరాల్‌గా ఒక మంచి థ్రిల్లర్ చూశామనే అనుభూతిని ఇస్తుంది. IMDbలో 6.4 రేటింగ్ సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఆస్వాదించే వారికీ, వీకెండ్‌లో మంచి మైండ్ గేమ్‌తో కూడిన సినిమా చూడాలనుకునే వారికీ పర్ఫెక్ట్ ఛాయిస్!




Click it and Unblock the Notifications