సమోసాలు అమ్మిన చేతులతోనే సినీ పరిశ్రమను శాసిస్తున్నాడు

కఠోర శ్రమ, పట్టుదల ఉంటే తలరాతను ఎలా మార్చుకోవచ్చో చెప్పడానికి ఈ బాలీవుడ్ బాద్‌షా జీవితమే ఒక నిలువెత్తు నిదర్శనం. ఒకప్పుడు ఢిల్లీలోని ఒక థియేటర్ క్యాంటీన్‌లో సమోసాలు అందిస్తూ తిరిగిన పదేళ్ల పిల్లాడు.. భవిష్యత్తులో ప్రపంచ సినీ రంగాన్ని శాసించే సూపర్‌స్టార్ అవుతాడని నాడు ఎవరూ ఊహించి ఉండరు. ఆ పిల్లాడే నేడు లక్షలాది మంది గుండెల్లో 'కింగ్ ఖాన్'గా కొలువైన షారుఖ్ ఖాన్.

ప్రముఖ నటుడు పంకజ్ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ బాల్యానికి సంబంధించిన ఒక అరుదైన విషయాన్ని పంచుకున్నారు. 70వ దశకంలో పంకజ్ కపూర్ 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా' లో యాక్టింగ్ నేర్చుకుంటున్న రోజుల్లో, క్యాంటీన్ నుండి ఒక చిన్న పిల్లాడు తరచూ సమోసాలు పట్టుకుని వస్తుండేవాడు. ఆ పిల్లాడే మన షారుఖ్.

Shahrukh khan With the very hands that once sold samosas he now calls the shots in the film industry

ఖతిర్ రెస్టారెంట్ లో

నిజానికి షారుఖ్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహమ్మద్ ఖాన్‌కు ఢిల్లీలో 'ఖతిర్' అనే రెస్టారెంట్ ఉండేది. దాంతో పాటు ఆయనకు ఎన్‌ఎస్‌డి మెస్, క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా ఉండేది. తండ్రికి సహాయంగా చిన్నారి షారుఖ్ అక్కడ ఆడుకుంటూనే పనిలో సాయం చేసేవాడు. అలా నసీరుద్దీన్ షా, రాజ్ బబ్బర్, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజ నటుల నటనను చిన్నప్పటి నుంచే కళ్లారా చూస్తూ షారుఖ్ పెరిగాడు. 1992లో వచ్చిన 'దీవానా' చిత్రంతో షారుఖ్ ఖాన్ వెండితెరకు పరిచయమయ్యాడు.

ఆ సినిమాలో అప్పటికే స్టార్ హీరోగా ఉన్న రిషి కపూర్ కథానాయకుడు. సినిమా ఫస్టాఫ్ అంతా రిషి కపూర్ నడిపించినా.. సెకండాఫ్‌లో ఒక పిచ్చి ప్రేమికుడిగా, బైక్‌పై పాడుకుంటూ షారుఖ్ ఎంట్రీ ఇచ్చిన విధానానికి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. తొలి చిత్రంలోనే ఒక దిగ్గజ నటుడు పక్కన ఉన్నా, తనదైన మేనరిజంతో ప్రేక్షకులు రిషి కపూర్‌ను మరిచిపోయి షారుఖ్‌తో ప్రేమలో పడేలా చేశాడు.

సమోసాల డెలివరీ బాయ్ నుండి

ఒకప్పుడు సాదాసీదాగా జీవితాన్ని ప్రారంభించిన షారుఖ్ క్రేజ్, నేడు ఏడు సముద్రాలు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నికర ఆస్తి విలువ మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.12,490 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచిన షారుఖ్ ఖాన్ ప్రయాణం, శూన్యం నుండి శిఖరానికి ఎలా చేరాలో చెప్పే ఒక రియల్ లైఫ్ ఇన్‌స్పిరేషన్!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+