ఆ రోజు చనిపోతానని భయపడ్డా.. కానీ వాళ్లే కాపాడారు !!
శత్రుఘ్న సిన్హా.. భారత సినీ పరిశ్రమలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గంభీరమైన స్వరం, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ.. బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు పొందారు. 1969లో సినీరంగంలోకి అడుగుపెట్టిన శత్రుఘ్న సిన్హా.. కెరీర్ ప్రారంభం లోనే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. మేరే అప్నే, కాళీచరణ్.. విశ్వనాథ్, కాలాపత్థర్, దోస్తానా వంటి హిట్ చిత్రాలతో స్టార్ నటుడిగా ఎదిగారు.
అంతే కాకుండా సినీ రంగంలో విజయవంతమైన ప్రయాణం తర్వాత శత్రుఘ్న సిన్హా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తపరచడం, ధైర్యంగా మాట్లాడడం వల్ల రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. నటన, రాజకీయాలు రెండింటిలోనూ ఆయన తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలదొక్కుకోవడం విశేషం. ఆయన కుమార్తె సోనాక్షి సిన్హా సైతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఈ క్రమంలోనే తన జీవితంలో ఎదురైన ఒక భయంకరమైన అనుభవాన్ని సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా గుర్తుచేసుకున్నారు. దొంగతనాలు, దాడులు ఎక్కువగా జరిగే రోజుల్లో న్యూయార్క్ నగరంలో తాను ఎదుర్కొన్న ఆ ఘటన తనను తీవ్ర భయానికి గురి చేసిందని చెప్పారు. ఆ రోజు తన జీవితంలో చివరి రోజేనని కూడా అనిపించిందని.. అయితే అనుకోని విధంగా ధర్మేంద్రతో కలిసి నటించిన ఒక సినిమా తన ప్రాణాలను కాపాడిందని ఎమోషనల్ అయ్యారు.
శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.. న్యూయార్క్‌కు వెళ్లినప్పుడు తాను రాడిసన్ హోటల్‌లో బస చేశానని తెలిపారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న తన స్నేహితురాలు ఒక రోజు డిన్నర్‌కు ఆహ్వానించడంతో ఆమె ఇంటికి వెళ్లానని.. డిన్నర్ అనంతరం షాపింగ్ చేసి తిరిగి హోటల్‌కు బయల్దేరినట్లు వివరించారు. అప్పటికే అర్ధరాత్రి ఒంటి గంట దాటడంతో ఆమె తనను కారులో తీసుకొచ్చి ఒక చోట దింపి, అక్కడి నుంచి కొద్దిదూరం నడిస్తే హోటల్ వస్తుందని చెప్పి వెళ్లిపోయిందన్నారు.
అయితే బ్యాగ్ నిండా ఖరీదైన వస్తువులతో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న తనకు గంటసేపు నడిచినా హోటల్ కనిపించలేదని చెప్పారు. చుట్టూ చూస్తే అన్ని దారులూ ఒకేలా కనిపించడంతో పాటు, ఆ ప్రాంతం దొంగలకు ప్రసిద్ధి చెందినదని అప్పట్లో పేరు ఉండటంతో భయం మరింత పెరిగిందన్నారు. ఒక వ్యక్తిని హోటల్‌కు దారి అడిగితే అతడు విసుగ్గా వెళ్లిపోయాడని.. చీకటి, నిర్మానుష్య వాతావరణంలో తనకు అదే చివరి రోజు అనిపించిందని శత్రుఘ్న సిన్హా గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో ఒక్కసారిగా ఒక కారు తన ముందుగా వెళ్లిందని, అందులో దోపిడీ దొంగలు ఉన్నారేమోనని అనుమానం వచ్చిందన్నారు. తనను చంపి, బ్యాగ్‌లో ఉన్న విలువైన వస్తువులు తీసుకెళ్తారని భావించి భయం రెట్టింపు అయిందని తెలిపారు. కానీ అనుకోని విధంగా ఆ కారులోని డ్రైవర్ బయటకు వచ్చి తనను గుర్తుపట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఆ డ్రైవర్ తాను ధర్మేంద్రతో కలిసి నటించిన పంజాబీ చిత్రం 'పుట్ జట్టన్ దే'లో నటించానని గుర్తించి మాట్లాడాడని శత్రుఘ్న సిన్హా చెప్పారు. ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమని హెచ్చరించిన అతడు, వెంటనే తన స్నేహితులను పిలిపించి శత్రుఘ్న సిన్హాను కారులో ఎక్కించుకొని సురక్షితంగా హోటల్ వద్ద దింపేశాడని వివరించారు. కృతజ్ఞతగా వారికి డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించినా వారు నిరాకరించారని, ఆ మానవత్వాన్ని తాను జీవితాంతం మర్చిపోలేనని అన్నారు.
-
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే!












Click it and Unblock the Notifications