లెజెండరీ గాయని ఎస్. జానకి కుటుంబంలో తీవ్ర విషాదం..!
లెజెండరీ గాయని ఎస్. జానకి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీ కృష్ణ (65) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈ వార్త సంగీత, సినీ వర్గాలను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. మురళీ కృష్ణ మరణంతో జానకి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ కృష్ణ మరణం ఒక కుటుంబానికే కాదు, కళా ప్రపంచానికి కూడా తీరని నష్టంగా పలువురు భావిస్తున్నారు. ఈ దుర్ఘటన జరగడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ విషయం తనను తీవ్ర షాక్‌కు గురిచేసిందని ప్రముఖ గాయని చిత్ర సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా స్పందించారు. ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు ఆ దేవుడు అపారమైన ధైర్యం ఇవ్వాలి" అంటూ ఆమె చేసిన పోస్ట్ అభిమానులను కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ, సంగీత ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు. మురళీ కృష్ణకు భార్య ఉమా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కాగా మురళీ కృష్ణను కేవలం జానకి కుమారుడిగానే కాకుండా, ఒక బహుముఖ ప్రతిభావంతుడిగా కూడా పరిశ్రమ గుర్తిస్తుంది. ఆయనకు భరతనాట్యంలో అపారమైన ప్రావీణ్యం ఉంది. నృత్య కళాకారుడిగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా నటుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 'వినాయకుడు', 'మల్లెపువ్వు' వంటి సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అంతేకాకుండా మలయాళ సినిమా 'కూలింగ్ గ్లాస్' కు రచయితగా కూడా పనిచేసి, కథా రచయితగా తన సత్తాను నిరూపించుకున్నారు.
గత కొన్నేళ్లుగా ఎస్. జానకి గారు పాటలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. గతంలో జానకి గారి ఆరోగ్యం గురించి మీడియాలో వచ్చిన పుకార్లను కూడా ఆయనే ఖండిస్తూ, తల్లిని కాపాడుతూ ముందుకు వచ్చారు. అలాంటి కొడుకు దూరమవడంతో జానకి గారి జీవితంలో తీరని లోటు ఏర్పడింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, జానకికి ఈ కఠిన సమయంలో దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని సినీ, సంగీత లోకమంతా ప్రార్థిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications