200 సినిమాల్లో స్టార్ కమెడియన్.. కానీ కడసారిచూపుకు కదలని టాలీవుడ్ !
తెలుగు సినీ ప్రేక్షకులను తన హాస్యంతో దశాబ్దాల పాటు కడుపుబ్బా నవ్వించిన నటుడు సుత్తివేలు. ఆయన తనదైన డైలాగ్‌లు, పంచ్‌లతో ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించి స్టార్ కమెడియన్ గా ఎదిగారు. అగ్ర హీరోల సినిమాల్లో సైతం సుత్తివేలు కామెడీ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. నేటికీ ఆయన సినిమాలు టీవీల్లో ప్రసారమైతే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారనడంలో సందేహం అక్కర్లేదు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుత్తివేలు భార్య లక్ష్మీ రాజ్యం.. సుత్తివేలు జ్ఞాపకాలను, చివరి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
సినీ కెరీర్..
సుత్తివేలు 1981లో వచ్చిన ముద్ద మందారం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నా దేశం, నాలుగు స్తంభాలాట, ఖైదీ, పల్లెటూరి మొనగాడు, అమరజీవి, రెండు జెల్ల సీత, మహానగరంలో మాయగాడు, రుస్తుం.. సహా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. నేటి తరానికి గుర్తుండేలా ఆ నలుగురు, మహారధి, వీర భద్ర, కృష్ణార్జున, శశిరేఖా పరిణయం వంటి సినిమాలతో కూడా కనెక్ట్ అయ్యారు. చివరగా రామాచారి అనే మూవీలో నటించాడు. అయితే ఈ మూవీ సుత్తివేలు చనిపోయన తర్వాత రిలీజ్ కావడం గమనార్హం.

సుత్తివేలు అసలు పేరు కే.ఎల్.ఎన్. నరసింహారావు. సినీ పరిశ్రమలోకి వచ్చాక.. దర్శకుడు జంధ్యాల ఆయనకు 'సుత్తివేలు' అనే పేరును పెట్టారని లక్ష్మీ రాజ్యం అన్నారు. ఈ పేరుతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడై గుర్తింపును తెచ్చుకున్నారని తెలిపారు. అలానే ఆయన ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించేవారని కూడా చెప్పుకొచ్చారు. ఉదయం స్నానం, పూజ, విష్ణు సహస్రనామం పూర్తయ్యాకే భోజనం చేసేవారని.. బయట ఆహారం అస్సలు తినేవారు కాదని స్పష్టం చేశారు. షూటింగ్‌లకు వెళ్లినా కూడా ఇంటి నుంచే పచ్చళ్లు, పొడులతో సహా ఆహారాన్ని తీసుకెళతారని వివరించారు.
అంతే కాకుండా శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి దిగ్గజ నటులు సైతం సుత్తివేలు తీసుకొచ్చే పచ్చళ్లను, పొడులను ఎంతగానో ఇష్టపడేవారని వెల్లడించారు. అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో చేసుకున్న ఆహారాన్నే తీసుకువెళ్ళేవారన్నారు. కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా 2012లో ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారని వాపోయారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారని.. మరణవార్త ఆలస్యంగా వెల్లడి కావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారి చూసుకోలేకపోయారని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇక ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తమకు బంధువని లక్ష్మీ రాజ్యం తెలిపారు. దాసరి నారాయణరావు సుత్తివేలు మరణానంతరం ఆయన కుమారుడికి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణతో సుత్తివేలుకి ప్రత్యేక అనుబంధం ఉండేదని, బాలకృష్ణ తమ పిల్లలను సైతం ఆప్యాయంగా పలకరించేవారని ఆమె వివరించారు.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications