ప్రభుత్వాలనే బెదిరించే స్థాయికి చేరిన థియేటర్ల మాఫియా అరాచకం
ఏపీ, తెలంగాణలో థియేటర్లను లీజు పద్ధతిలోకి తీసుకున్న నిర్మాతల మాఫియా ఇప్పుడు ఏకంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలనే బెదిరించే స్థాయికి చేరింది. గతంలో టికెట్ రేట్ల విషయంలో అడ్డదిడ్డంగా మాట్లాడిన వారు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరని, కేవలం తాము చెప్పిందే వేదమని దిల్ రాజు తరఫున అతని సోదరుడు శిరీష్ రెడ్డి ఇటీవల ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు
శిరీష్ రెడ్డి, ఏషియన్ సునీల్ నారంగ్ లాంటివారు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ లాంటివారు ఏమీ తెలియనట్లుగా వెనకుండి చోద్యం చూస్తుంటారు. అంతిమంగా అద్దె విధానమైనా, పర్సెంటేజీ విధానమైన వీరి థియేటర్లలోకి రావాల్సిందే. అంతిమంగా లాభపడేది వీరే. తాము తీసే సినిమాలకు ఒక రూల్, వేరే వారు తీసే సినిమాలకు మరో రూల్ అన్నట్లుగా వీరు వ్యవహరిస్తున్నారు. తాజాగా దిల్ రాజు టీం నుండి వినిపిస్తున్న మాటలు, ప్రభుత్వాలనే హెచ్చరించేలా ఉన్న తీరు చూస్తుంటే.. అసలు ఈ ఇండస్ట్రీ ఎటు పోతోంది? అన్న సందేహం కలుగుతోంది.

థియేటర్లు వర్కౌట్ అవలేదు మూసుకోండి అన్న ఓ నిర్మాత ఇప్పుడు పరిశ్రమలోనే లేడని దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి అనడాన్ని బట్టి దీన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని? అని సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి కుటుంబానికి సంబంధించిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లాంటివారు నటించిన సినిమాలు విడుదలైనప్పుడే ఇటువంటి రాద్ధాంతాన్ని తెరపైకి తెస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.
థియేటర్లు వర్కౌట్ అవడంలేదంట
థియేటర్లు వర్కౌట్ అవ్వడం లేదని సాకు చూపుతూ, పరోక్షంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం.. తమకు అనుకూలమైన జీవోలు రాకపోతే సినిమాలు ఆపేస్తామనే రేంజ్‌లో బెదిరింపులకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అడ్డగోలుగా మాట్లాడే సంస్కృతికి తామే కేరాఫ్ అడ్రస్ అని వీరు నిరూపిస్తున్నారు. ఇంత ధైర్యంగా వీరు అరాచకానికి పాల్పడుతున్నారంటే, దాని వెనుక బలమైన రాజకీయ శక్తులు లేదా అత్యున్నత స్థాయి అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజారిటీ థియేటర్లను ఈ పెద్దలే లీజుకు తీసుకుని 'సిండికేట్'గా మారారు.
ఎవరైనా కొత్త నిర్మాతలు లేదా చిన్న హీరోలు తమకు ఎదురుతిరిగితే, వారికి థియేటర్లు దొరక్కుండా చేయడం, ఉన్నా ప్రైమ్ టైమ్ షోలు ఇవ్వకపోవడం వంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఈ గుత్తాధిపత్యం వల్ల సృజనాత్మకత చచ్చిపోయి, కేవలం వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా మారుతున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని ీ థియేటర్ల మాఫియాకు చెక్ పెట్టకపోతే రానున్న రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమ అనేది పుస్తకాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications