ఓటీటీలోకి దూసుకొచ్చిన మూడు సూపర్ హిట్ సినిమాలు

ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ ఖర్చుతో కుటుంబమంతా కలిసి సినిమా చూసే అవకాశం ఉండటంతో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి.

తాజాగా మూడు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చాయి. కిరణ్ అబ్బవరం నటించిన 'కె ర్యాంప్', సిద్దు జోన్నలగడ్డ నటించిన 'తెలుసు కదా', తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్'. ఈ మూడు సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చాయి. విచిత్రం ఏమిటంటే ఈ మూడు సినిమాలు కూడా ఒకే రోజు థియేటర్లలో విడుదలయ్యాయి.

Three super hit movies streaming on OTT

కె ర్యాంప్: కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. కొంచెం అడల్ట్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది.ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుసు కదా: సిద్దు జోన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు.ట్రయాంగిల్ లవ్ స్టోరీ‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. సిద్దు గత సినిమాలను పోలిస్తే ఈ సినిమా కాస్తా తగ్గిందనే మాటలు వినిపించాయి. అయినప్పటికీ ఈ సినిమాపై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

డ్యూడ్: తమిళ స్టార్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. ఓ అమ్మాయిని ఇద్దరు ప్రేమించే కథతో ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో 100 కోట్లు సాధించిన ఈ సినిమా తెలుగులో మాత్రం పెద్దగా విజయాన్ని సాధించలేకపోయింది.

ప్రస్తుతం ఈ మూడు సినిమాలు ఓటీటీలో సినీ లవర్స్‌ను అలరిస్తున్నాయి. మీరు కూడా ఈ సినిమాలపై ఓ లుక్ వేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+