NTR చేయాల్సిన 2 బ్లాక్‌బస్టర్లు ఆ హీరో దగ్గరకు ఎలా వెళ్లాయి?

సినిమా రంగంలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం అనేది సహజంగా జరుగుతుండేదే. కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, కథ నచ్చకపోవడం, బడ్జెట్ కుదరకపోవడం, దర్శకుడిని మార్పు చేయాలని హీరో చెప్పడం లాంటి కారణాలు చాలా ఉంటాయి. అయితే ఇలా వదులుకున్న కథలు మరో హీరో దగ్గరకు వెళ్లిన తర్వాత అతను వాటితో బ్లాక్ బస్టర్లు కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మ్యాచో స్టార్ గోపీచంద్ దగ్గరకు వెళ్లి అతను రెండు సూపర్ హిట్లు కొట్టాడు. వాటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దర్శకుడితో ఒప్పందం కుదరడంతో కుదర్లేదు

అవే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే మాత్రం మిస్ చేసుకున్న హీరోలు అవి సూపర్ హిట్ అయిన తర్వాత బాధపడుతుంటారు. గోపీచంద్ ను హీరోగా నిలబెట్టిన 'యజ్ఞం' కథ మొదట ఎన్టీఆర్ దగ్గరికే వెళ్లింది. అప్పట్లో మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న తారక్‌కు ఈ కథ బాగా నచ్చినప్పటికీ ఈ సినిమాకు వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తే తాను చేస్తానని ఎన్టీఆర్ కండిషన్ పెట్టారు. కానీ నిర్మాత పోకూరి బాబురావు మాత్రం అప్పటికే దర్శకుడు రవికుమార్ చౌదరితో ఒప్పందం కుదుర్చుకున్నారు. దర్శకుడి మార్పుకు నిర్మాత ఒప్పుకోకపోవడంతో ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత అదే కథతో గోపీచంద్ హీరోగా 'యజ్ఞం' తెరకెక్కి సంచలన విజయం సాధించింది.

Tollywood How did the two blockbuster films that were originally meant for NTR end up going to that hero

ఆ రెండు తారక్ చేసుంటే మరోలా ఉండేది

గోపీచంద్ ఖాతాలో మరో మాస్ హిట్ గా నిలిచిన సినిమా 'ఆంధ్రుడు'. ఈ పోలీస్ బ్యాక్‌డ్రాప్ కథను కూడా మొదట ఎన్టీఆర్ తోనే చేయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పట్లో కొన్ని సాంకేతిక కారణాలు, ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ ఈ సినిమాను చేయలేకపోయారు. ఈ కథ కూడా తారక్ కు బాగా నచ్చింది. చివరికి ఈ అవకాశం కూడా గోపీచంద్‌నే వరించింది. ఈ రెండు సినిమాలతో గోపీచంద్ టాలీవుడ్‌లో మాస్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

యజ్ఞం, ఆంధ్రుడు సినిమాలను గోపీచంద్ కావాలనే ఎన్టీఆర్ దగ్గర నుంచి లాక్కున్నారంటూ ఆ సమయంలో విపరీతమైన ప్రచారం జరిగింది. కేవలం కాంబినేషన్లు కుదరకే అవి గోపీచంద్ దగ్గరకు వెళ్లాయని తేలింది. గోపీచంద్ కు అలా అదృష్టం కలిసివచ్చింది. కాకపోతే ఆ రెండు సినిమాలు తారక్ చేసుంటే మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+