కాజల్ కలలోకి మహేష్‌బాబు కాకుండా ఓ దర్శకుడు వచ్చాడు మీకు తెలుసా!
చందమామ లాంటి అందంతో, నటనతో టాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు ఓ సినిమా వేడుకలో ఊహించని వింత ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్‌లోని దాదాపు అందరు అగ్ర హీరోలతో జతకట్టిన కాజల్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'బిజినెస్ మ్యాన్', 'బ్రహ్మోత్సవం' చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో 'బిజినెస్ మ్యాన్' సినిమా ఈవెంట్ సందర్భంగా ఓ సరదా ఘట్టం చోటుచేసుకుంది. ఈ వేడుకకు హోస్ట్ అవతారమెత్తిన డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, అందరినీ ఇరుకున పెట్టే గడుసు ప్రశ్నలతో సందడి చేశారు. ఈ క్రమంలో కాజల్ వంతు రాగానే.. "మీరు మహేష్ బాబుతో పని చేశారు కదా.. ఎప్పుడైనా ఆయన మీ కలలోకి వచ్చారా?" అని నేరుగా అడిగేశారు.

కాజల్ తడబడలేదు
ఈ ఊహించని ప్రశ్నకు కాజల్ ఏమాత్రం తడబడకుండా, ఎంతో సమయస్ఫూర్తితో చమత్కారంగా సమాధానమిచ్చింది. "మహేష్ గారి సంగతి నాకు తెలియదు కానీ సర్.. మీరే ప్రతి రోజూ నా కలలోకి వచ్చి భయపెట్టేవారు!" అంటూ పూరీపైనే సరదాగా రివర్స్ పంచ్ వేసింది. కాజల్ ఇచ్చిన ఈ గడుసు సమాధానంతో వేదికపై నవ్వుల పువ్వులు పూశాయి. అంతేకాకుండా, నమ్రతతో ఉన్న అనుబంధం గురించి అడిగినప్పుడు, ఆమెను "నా చిట్టి చెల్లెలు" అని ప్రేమగా పిలుస్తానని చెప్పి అందరి మనస్సులను దోచుకుంది.
నటిగా నిలబెట్టింది టాలీవుడ్
అదే వేడుకలో పూరీ జగన్నాథ్ అడిగిన మరో ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ, నన్ను నటిగా నిలబెట్టింది టాలీవుడే. అందుకే నాకు అన్ని భాషల కంటే తెలుగు చిత్రసీమ అంటేనే ప్రాణం" అని తన ప్రేమాభిమానాలను చాటుకుంది. పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా నటిగా కొనసాగుతూనే, ప్రస్తుతం తన భర్తతో కలిసి వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది కాజల్.




Click it and Unblock the Notifications