OTT Movies : ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఒకే రోజు ఏకంగా 19 సినిమాలు
ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ ఖర్చుతో కుటుంబమంతా కలిసి సినిమా చూసే అవకాశం ఉండటంతో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి.
అయితే సినీ ప్రియులకు ఈ వారం డబుల్ ధమాకా ఖాయంగా కనిపిస్తోంది. పలు సూపర్ హిట్ సినిమాలతో పాటు క్రేజీ వెబ్ సిరీస్‌లు ఈ వీకెండ్ స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. ముఖ్యంగా రామ్ పోతినేని, కీర్తి సురేశ్ చిత్రాలతో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏ ప్లాట్ ఫామ్ లో ఏ ఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయో మీకోసం ప్రత్యేకంగా..

నెట్‌ఫ్లిక్స్ :
ఆంధ్ర కింగ్ తాలుకా : రామ్ పోతినేని నటించిన ఈ సినిమా డిసెంబరు 25న క్రిస్మస్ కానుకగా రానుంది. ఇది ఒక అభిమాని తన స్టార్ హీరో కోసం చేసే ప్రయాణంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచించి
రివాల్వర్ రీటా : కీర్తి సురేశ్ నటించిన ఈ క్రైమ్ కామెడీ డిసెంబరు 26న స్ట్రీమింగ్ కానుంది. డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 : ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ సిరీస్ చివరి సీజన్‌లోని కీలక ఎపిసోడ్లు తెలుగు డబ్బింగ్‌తో సహా డిసెంబరు 26న విడుదల కానున్నాయి.
డిస్నీ+ హాట్‌స్టార్:
నోబడీ 2 : హాలీవుడ్ యాక్షన్ మూవీ డిసెంబరు 22 నుండే అందుబాటులోకి వచ్చింది.
ద బ్యాడ్ బాయ్ అండ్ మీ: తెలుగు డబ్బింగ్ మూవీ డిసెంబరు 22న స్ట్రీమ్ అవుతుంది.
జీ5 (ZEE5) :
మిడిల్ క్లాస్ : తమిళ డబ్బింగ్ సినిమా డిసెంబరు 24న రాబోతుంది.
ఏక్ దివానే కీ దివానియత్: డిసెంబరు 26న హిందీ మూవీ స్ట్రీమింగ్.
ప్రస్తుతం ఈ సినిమాలు ఈ వారం ఓటీటీ లవర్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మీరు కూడా ఈ సినిమాలపై ఓ లుక్ వేయండి.












Click it and Unblock the Notifications