మగాడిలో ఆ మ్యాటర్ ఉందో లేదో చెక్ చేయాల్సిందే.. హీరోయిన్ సంచలన కామెంట్స్

నేటి యువత, ముఖ్యంగా మహిళలు పెళ్లి, రిలేషన్‌షిప్‌ల విషయంలో పాత ధోరణులను పక్కన పెట్టి, తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో, బుల్లితెర ప్రముఖ నటి వాబిజ్ దొరబ్జీ చేసిన కామెంట్లు పెను దుమారం రేపుతున్నాయి. తన వ్యక్తిగత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న వాబిజ్, తన తాజా ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్స్, ఆర్థిక స్థిరత్వం, మరియు 'గోల్డ్ డిగ్గర్స్' అనే పదంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూణేలోని పార్సీ కుటుంబానికి చెందిన వాబిజ్ దొరబ్జీ, 'ప్యార్ కీ యే ఏక్ కహానీ' సీరియల్‌తో నటనలో అడుగుపెట్టారు. ఆ సీరియల్‌లో సహనటుడు వివియన్ దిసేనతో ప్రేమలో పడి, 2013లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే, కొద్ది కాలంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో, 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

TV Actress Vahbiz Dorabjee Slams Gold Diggers Shares Shocking Experience of Emotional Blackmail

ఈ విడాకుల సమయంలో, వాబిజ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ జరిగింది. ఆమె వివియన్ నుంచి భారీ భరణాన్ని డిమాండ్ చేసిందనే ఆరోపణలు, వివియన్‌ను వేధించిందనే వార్తలు అప్పట్లో కలకలం సృష్టించాయి. ఈ ఆరోపణలకు వాబిజ్ ఎప్పటికప్పుడు ఘాటుగా సమాధానం ఇస్తూ వచ్చారు.

విడాకుల తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వాబిజ్ దొరబ్జీ, తాజాగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక వ్యక్తి తనకు కుచ్చుటోపీ పెట్టాలని చూశాడని, నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి రెండు మూడు సార్లు డబ్బు కూడా గుంజాడని ఆమె సంచలన విషయం బయటపెట్టారు.అతని కన్ను నా డబ్బు, ఆస్తిపై పడింది. ఇలాంటి వారిని గోల్డ్ డిగ్గర్స్ అంటారని ఆమె కుండబద్దలు కొట్టారు.

ఈ రోజుల్లో చాలా మంది పురుషులు తమకు డబ్బు అవసరమైనప్పుడల్లా మొహమాటం లేకుండా అడుగుతున్నారని, మొదట అమ్మాయిల ఆర్థిక వివరాలు తెలుసుకుని వారితో మాట కలుపుతున్నారని వాబిజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో, పెళ్లికి ముందు అమ్మాయిలు తమ భాగస్వామిలో ఆర్థిక స్థిరత్వం, భద్రత ఉన్నాయా లేదా అని చూడటం తప్పు కాదని వాబిజ్ బలంగా వాదించారు. ఒక అమ్మాయి తన జీవిత భాగస్వామి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం, భద్రత కోరుకోవడం సహజం. ఇలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిలపై గోల్డ్ డిగ్గర్స్ అనే ముద్ర వేయడం పూర్తిగా తప్పు. ఆమెలో ఎలాంటి చెడు ఉద్దేశం లేదని వాబిజ్ దొరబ్జీ చేసిన ఈ వ్యాఖ్యలు నేటి రిలేషన్‌షిప్స్ డైనమిక్స్ గురించి ఆలోచించేలా చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+