వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి మరో భారీ చిత్రాన్ని రూపొందిస్తోన్నారు. వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న అయిదో సినిమా ఇది. అలాగే కల్యాణ్ రామ్ తో రీయూనిట్ కావడం ఇది రెండోసారి. ఆయా మూవీలన్నీ కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టినవే కావడం వల్ల ఈ లేటెస్ట్ ఫిల్మ్ పైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీని విడుదల తేదీ కూడా వెల్లడైంది అప్పుడే.
ఈ భారీ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. 2027 సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా విడుదల కాబోతోంది. దీనికి VenkyAnil5, NkrAR2 అనే వర్కింగ్ టైటిల్స్ ఖరారయ్యాయి. భగవంత్ కేసరి, మన శంకర వరప్రసాద్ గారు వంటి వరుస విజయాలందించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో సాహు గారపాటి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్, అర్చన సంయుక్తంగా సమర్పించనున్నాయి. జీ స్టూడియోస్ సహనిర్మాతగా చేరింది.

ఈ సినిమా అనిల్ రావిపూడికి వెంకటేష్‌తో అయిదో ప్రాజెక్ట్. గతంలో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి విజయవంత చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో రానుంది. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ తొలి బ్లాక్ బస్టర్ పటాస్ కు దర్శకత్వం వహించింది అనిల్ రావిపూడే. ఈ విజయం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటిస్తోండటం ఇది రెండోసారి.
Excited to collaborate for the third time with dear brother @sahugarapati7 and @Shine_Screens for #VenkyAnil5 #NKRAR2 🤗🤗
— Anil Ravipudi (@AnilRavipudi) March 27, 2026
Glad to have @ZeeStudios_ join this journey and the legendary @SureshProdns present it 😍👌🏻
SANKRANTHI 2027 RELEASE ✨
Victory @VenkyMama @NANDAMURIKALYAN… pic.twitter.com/zVryHSdasE
అలాగే షైన్ స్క్రీన్స్ బ్యానర్‌తో అనిల్ రావిపూడికి ఇది మూడో చిత్రం. అనిల్ రావిపూడి తన మార్కు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా, ఆకట్టుకునే కథనంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు, పండగ వాతావరణం పర్ఫెక్ట్‌గా మేళవించిన ఈ చిత్రాన్ని సంపూర్ణ సంక్రాంతి కానుకగా రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు. త్వరలో పూజతో చిత్రాన్ని ప్రారంభించి, అధికారిక టైటిల్, ఇతర వివరాలను వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications