ఈ టీజర్ అరిపించింది: ఇంకో రూ.1,000 కోట్లు ఖాతాలో వేసుకున్నాడు

రాకింగ్ స్టార్ యష్ అప్ కమింగ్ మూవీ.. టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్.. తాజాగా విడుదలైంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడం, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో చిత్రీకరణ జరుపుకొంది. ఈ అయిదు భాషల్లో టీజర్ రిలీజ్ అయింది. రాయా క్యారెక్టర్ లో నటించాడు యష్.

1:55 సెకెన్ల నిడివి ఉన్న టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెచ్చాయి. కేజీఎఫ్ తో పోల్చుకుంటే యష్ భిన్నంగా కనిపించాడిందులో. ఓ పార్టీ వాతావరణంలో గ్రాండ్ సన్నివేశాలతో ప్రారంభం అయ్యే ఈ టీజర్.. యాక్షన్ దృశ్యాలతో కట్టిపడేసింది. సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని రుచి చూపింది. ఈసారి యుద్ధం.. మరింత భయానకంగా ఉంటుందని చెప్పకనే చెప్పింది. యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా హైలైట్. హాలీవుడ్ యాక్షన్ కోరియోగ్రాఫర్ జేేజే పెర్రీ వీటిని తెరకెక్కించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జాన్ విక్.. ఏ రేంజ్ స్టంట్స్ ఉంటాయో మనకు తెలిసిందే.

Yash Returns in Toxic a Fairytale for Grown Ups Teaser Promises Merciless Action to Release March 19

రాయా వారిని ఎదిరించి మనుగడ సాగించలేడని హెచ్చరించే సన్నివేశం ఉత్కంఠతను రేపుతుంది. ఈ టీజర్‌లో అద్భుతమైన పోరాటాలు కనిపిస్తాయి. రాయల్ సర్కస్‌, మంచు కొండల్లో విభిన్నమైన ప్రాంతాల్లో జరిగే యాక్షన్ సన్నివేశాలు సినిమా రేంజ్ ను చాటిచెప్పాయి. రాయా పాత్ర మోర్ పవర్‌ఫుల్ గా కనిపించింది. "ఇట్స్ ఓవర్, వెన్ ఐ సే ఇట్స్ ఓవర్. టిల్ దెన్, హావ్ సమ్ మ్యానర్స్.. " అనే డైలాగ్.. కేజీఎఫ్ 2 ను తలపిస్తుంది. చైన్‌సా పట్టుకొని కనిపించిన యష్ షాట్.. ఈ టీజర్ కే హైలైట్.

చిత్ర కథాంశం 1940ల నుంచి 1970ల మధ్య గోవాలో నెలకొన్న నేర సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. అక్రమ రవాణా మార్గాలు, భయానక అండర్ వరల్డ్ గ్యాంగ్ నేరాలు, వాటి మధ్య ఆధిపత్య పోరు మధ్య ఓ గ్యాంగ్ స్టర్ తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడనేది చిత్రం కథాంశం. నయనతార గంగ, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్.. ముఖ్య పాత్రలు పోషించారు. గీతూ మోహన్‌దాస్-, యష్ స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల దిల్ రాజు దక్కించుకున్నారు. ఏకంగా 120 కోట్ల రూపాయలకు ఏపీ, తెలంగాణల్లో థియేట్రికల్ హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసింది. 'టాక్సిక్' చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజు రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన 'ధురంధర్ 2: ది రివెంజ్ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉంటుంది.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+