జాంబీ రెడ్డి సీక్వెల్.. కంప్లీట్ రివర్స్: కన్నడ సూపర్ స్టార్ పవర్ హౌస్ క్యారెక్టర్
నేడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఓ సర్ ప్రైజ్ లభించింది. ఆయన కెరీర్‌లో విలక్షణమైన విజయాన్ని అందుకున్న తొలి తెలుగు జాంబీ థ్రిల్లర్ జాంబీ రెడ్డి కి సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జాంబీ రెడ్డి 2 - నెక్స్ట్ లెవెల్ (Zombie Reddy 2 - Nxt Lvl) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ప్రత్యేక ప్రమోషనల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ ఫిల్మ్ తెరకెక్కబోతోంది. ఈ గ్లింప్సెస్ మొత్తం కూడా రివర్స్ లో ఉండటం కట్టిపడేసింది.
మొదటి భాగం సృష్టించిన సంచలనం కంటే ఈ సీక్వెల్‌ను మరింత భారీగా, నూతన యాక్షన్ కాన్సెప్ట్‌తో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ ఇంటెన్స్, పవర్‌హౌస్ పాత్రలో పలకరించబోతున్నారు. ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ షనాయా కపూర్ ఈ యాక్షన్ డ్రామా ద్వారా సౌత్ ఇండియన్ ఫిల్మ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోన్నారు.

ఈ క్రేజీ సీక్వెల్ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ చేపట్టారు. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ది ఫ్యామిలీ మేన్ 2, రానా నాయుడు, హక్ వంటి సిరీస్‌లకు పనిచేసిన సుపర్ణ్ ఎస్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు క్రియేటర్‌గా వ్యవహరిస్తూ కథా చర్చల్లో కీలక పాత్ర పోషించడం సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ డిఫరెంట్ జాంబీ చిత్రానికి హుస్సేన్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్ణ్ ఎస్ వర్మ కలిసి అద్భుతమైన స్క్రీన్‌ప్లేను సిద్ధం చేశారు. హనుమాన్, మిరాయ్ సినిమాల విజయాల తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఈ సీక్వెల్‌కు అదిరిపోయే సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించబోతున్నాడు. ప్రశాంత్ వర్మ క్రియేటివ్ భాగస్వామ్యంతో వచ్చే కథ కావడంతో ఈ సినిమా సంగీతం పరంగా సరికొత్త అనుభూతిని ఇస్తుందని యూనిట్ చెబుతోంది.
#TejaSajjaPMF2 is #ZombieReddy2 - NXT LVL.🤘🏻
— People Media Factory (@peoplemediafcy) August 23, 2026
TITLE ANNOUNCEMENT VIDEO OUT NOW 🔥
-- https://t.co/fZmcN8dzoe
Welcoming you all back to the ZOMBIE-VERSE 🧟♂️
This time, it’s BIGGER, BADDER & BLOODIER 💥
Happy Birthday, Superhero @tejasajja123 ❤️🔥
NXT LVL — DEAD OR ALIVE. 2027 😎… pic.twitter.com/xyre8pZYX1
ఈ సరికొత్త భారీ బడ్జెట్ సినిమాను కేవలం దేశీయ మార్కెట్లను మాత్రమే కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను కూడా టార్గెట్ చేస్తూ విస్తృతంగా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, నేపాలీ, జపనీస్ భాషల్లో కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తేజ సజ్జ జన్మదినం నాడు వచ్చిన ఈ భారీ అప్‌డేట్ సినిమాపై హైప్ పెంచింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.












Click it and Unblock the Notifications