ఏపీకి రాజధానిగా అమరావతి ఒకటే అవసరమా? లేక నాలుగు నగరాలా?: మీ అభిప్రాయమేంటీ?
అమరావతి: రాజధాని అమరావతిని తరలిస్తారంటూ కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. రాజధాని తరలింపుపై త్వరలోనే ఓ కీల ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన దీనికి కారణమైంది. కృష్ణానదికి సంభవించిన వరదను దృష్టిలో పెట్టుకుని రాజధానిని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తారని, దీన్ని తాము అడ్డుకుని తీరుతామని తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ ప్రకటించాయి.
దీనికి అనుగుణంగా ఆయా పార్టీల నాయకులు పోరు బాటకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజధాని అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. అభివృద్ధిని వికేంద్రీకరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమనంగా అభివృద్ధి చెందడానికి రాజధానిని అమరావతికి మాత్రమే పరిమితం చేయకూడదనే డిమాండ్ వినిపిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా నగరాలను ఎంపిక చేసి, వాటిని రాజధానులుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, దానికి సరైన సమయం ఇదేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Recommended Video
హైదరాబాద్ తరహాలో అభివృద్ధిని ఒకేచోట పరిమితం చేయకూడదని, దీనివల్ల వెనుక బడిన ప్రాంతాలు పురోగమించబోవని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రాజధాని నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా సమన్యాయం చేసినట్టవుతుందని చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయగలరు.












Click it and Unblock the Notifications