ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? మీ కామెంట్ ఏంటి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్ర ప్రజలతో తమకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేసిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదాకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టుకు తామెన్నడూ అడ్డుపడలేదని కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. గోదావరి జలాల్లో తమకు రావల్సిన 1000 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ స్టేటస్‌కు కేసీఆర్ మద్దతిస్తారన్న విషయాన్ని జగన్ చెబుతుంటే ఆయనకు చెవిలో చెప్పారా అంటూ బాబు ఎద్దేవా చేయడాన్ని తప్పుబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్.. జగన్ పార్టీ నుంచి గెలిచే ఎంపీలతో కలిసి ఆంధ్రాకు ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో బాబు వ్యాఖ్యలపై కేసీఆర్ ఇచ్చిన వివరణతో ఎవరికి లాభం చేకూరనుంది? ఎవరికి నష్టం జరుగనుందన్న అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి?













Click it and Unblock the Notifications