సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్‌లో మాజీ అగ్నివీరులకు 10 రిజర్వేషన్లు, వయో పరిమితి సడలింపు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) లో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) లో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీgతో పాటు, మొదటి బ్యాచ్‌లోని మాజీ అగ్నివీర్లకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇచ్చింది.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) గురువారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో తదుపరి బ్యాచ్‌లోని మాజీ అగ్నివీర్లకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుందని పేర్కొంది.

 10% reservation for ex-Agniveers in CISF recruitment and relaxation in age limit

నోటిఫికేషన్ ప్రకారం.. మాజీ- అగ్నివీర్లకు కూడా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది. దీని కోసం, హోంమంత్రిత్వ శాఖ సీఐఎస్ఎఫ్ చట్టం, 1968ని సవరించింది. కాగా, సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) మాజీ అగ్నివీరుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఇదే విధమైన ప్రకటన చేసింది .

కాగా, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పదిహేడున్నర, 21 ఏళ్లలోపు యువ అభ్యర్థులను నాలుగేళ్ల స్వల్పకాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్ చేసేందుకు అగ్నిపథ్ పథకాన్ని గతేడాది జూన్ 14న కేంద్రం ప్రకటించింది. ఈ పథకంలో రిక్రూట్ అయిన అభ్యర్థులను అగ్నివీర్లు అంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+