తెలంగాణలో టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్..!
తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 3 నుండి 13వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు.
ఈ పరీక్షలకు మొత్తం 38,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 24,415 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఉత్తీర్ణత శాతం 73.35గా నమోదైంది. విద్యార్థులు తమ ఫలితాలను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ (https://bse.telangana.gov.in) ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఇక 2024 సంవత్సరానికి సంబంధించిన ప్రధాన ఎస్‌ఎస్‌సీ (టెన్త్) పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించగా, రాష్ట్రవ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈసారి టెన్త్ ఫలితాల విడుదలలో ప్రభుత్వం కీలకమైన మార్పులు చేసింది. గతంలో ఉన్న కేవలం గ్రేడింగ్ విధానానికి బదులుగా, ఈ ఏడాది విద్యార్థుల మెమోలో గ్రేడ్స్‌తో పాటు వ్యక్తిగతంగా పొందిన మార్కులను కూడా చూపించారు. ప్రతి సబ్జెక్టుకు మొత్తం 100 మార్కులలో 80 మార్కులు బహిరంగ పరీక్షలకు, 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్‌కు కేటాయించారు. చివరకు, విద్యార్థుల జీపీఏ మెమోలో ఎక్స్‌టర్నల్ మరియు ఇంటర్నల్ మార్కుల వివరాలను స్పష్టంగా పొందుపరిచారు.












Click it and Unblock the Notifications