SSC CGLలో 14,582 పోస్టులు.. అప్లై చేయడానికి నేడే లాస్ట్ డేట్ ?

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్తగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ (CGL) ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 14,582 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని గ్రూప్-B, గ్రూప్-C పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సెంట్రల్ ఎగ్జైజ్ నుంచి ఆదాయపు పన్ను విభాగం వరకు పలు కీలక విభాగాల్లో ఉద్యోగాలు పూరిస్తారు.

భర్తీ చేయనున్న ముఖ్యమైన పోస్టులు..

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌
  • ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
  • సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
  • ప్రివెంటివ్ ఆఫీసర్
  • ఎగ్జామినర్
  • అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI, Narcotics)
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
  • డివిజనల్ అకౌంటెంట్
  • స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II
  • జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
  • ఆడిటర్, అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్
  • పోస్టల్ అసిస్టెంట్ / సోర్టింగ్ అసిస్టెంట్
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ / UDC
  • ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న డెస్క్, ఫీల్డ్ ఉద్యోగాలు
14-582-posts-in-ssc-cgl-and-today-is-the-last-date-to-apply

అర్హతలు..

పోస్టులను బట్టి అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

కొన్ని ప్రత్యేక పోస్టులకు సీఏ/సీఎంఏ/సీఎస్, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి విద్యార్హతలు అవసరం.

జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ వంటి పోస్టులకు మ్యాథ్స్/స్టాటిస్టిక్స్ లో స్పెషలైజేషన్ ఉండాలి.

వయోపరిమితి..

వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (2025 ఆగస్టు 1నాటికి).

రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ..

అభ్యర్థులు CBT-1, CBT-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ వంటి దశల ద్వారా ఎంపిక అవుతారు.

CBT-1 లో అన్ని అభ్యర్థులకు ఓపెన్ టెస్ట్ కాగా, CBT-2 లో పోస్టును బట్టి ప్రత్యేకమైన సబ్జెక్ట్ ప్రశ్నలు ఉంటాయి.

అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలు, పరీక్ష మాధ్యమం (తెలుగు సహా ఇతర భాషలు) ఎంపిక చేసుకోవచ్చు.

జీత భత్యాలు..

ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా రూ.29,200 నుంచి రూ.1,42,400 వరకు వేతనం లభిస్తుంది. కొంతమంది గ్రూప్-B పోస్టులకు హెచ్‌ఆర్ఎ, డీఏ, టీఏ వంటి అదనపు భత్యాలు వర్తించవచ్చు.

కాగా దరఖాస్తులకు నేటితో ( జూలై 4, 2025 ) గడువు ముగియనుంది. అలానే ఫీజు చెల్లింపులకు జూలై 5, 2025 చివరి తేదిగా నిర్ణయించారు. దరఖాస్తుల సవరణకు జూలై 9 నుంచి జూలై 11 వరకు అవకాశం కల్పించారు. CBT-1 పరీక్ష ఆగస్టు 13 - 30, 2025, CBT-2 పరీక్ష తేదీలు డిసెంబర్ 2025 లో నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in ని చూడొచ్చు. ఆసక్తి ఉన్నవారు చివరి రోజు అయిన అప్లై చేసుకొని ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+