Jobs: వైద్య కళాశాల్లో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తాం: హరీశ్ రావు
వైద్య కళాశాల్లో ఖాళీగా ఉన్న 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వైద్య కళాశాల్లో త్వరలో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబురుజు అసుపత్రిలో ఏర్పాటు చేసిన 'ఇన్‌ఫెక్షన్ల నివారణ- అవగాహన' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైద్య కళాశాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీతో వైద్య సేవలు మరింత మెరుగవుతాయని తెలిపారు. మాతా శిశు మరణాల విషయంలో రాష్ట్రం చాలా మెరుగైందని అయినప్పటికీ మరణాలకు గల కారణాలపై లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నిమ్స్
ప్రాథమిక స్థాయిలోనే గర్భిణీల సమస్యలు గుర్తించగలిగితే మరణాల సంఖ్య తగ్గించవచ్చునని చెప్పారు. నిమ్స్‌లో 250పడకలు, గాంధీలో 200 పడకలతో ఎంసీహెచ్ ఆసుపత్రులు తీసుకువస్తున్నామని ప్రకటించారు. కేసీఆర్ కిట్, మిడ్ వైఫరీ వ్యవస్థ, అమ్మ ఒడి వాహనాలు, న్యూట్రిషన్ కిట్ వంటి సదుపాయాలు గర్భిణీలకు కల్పించినట్లు గుర్తు చేశారు. మాతా శిశుసంరక్షణ ఆసుపత్రుల సంఖ్య పెంచుతున్నట్లు
హరీశ్ రావు తెలిపారు.

82శాతం
సంగారెడ్డి జిల్లాలో 82శాతం ప్రసవాలు అంటే సగటున నెలకు 1400 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయన్నారు. మాతా శిశు మరణాలకు కారణాలను అన్వేషించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని హరీష్ రావు వివరించారు. కాగా సూర్యాపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం తాజాగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం/హోమియోపతి) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.

రూ.35 వేల వేతనం
బీహెచ్ఎంఎస్, బీఏఏంఎస్ పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.35 వేల వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి నియామక పరీక్ష ఉండదని, డిగ్రీలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తామని ప్రకటించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications