Jobs: కోర్టుల్లో కొలువుల జాతర.. 2,054 పోస్టుల భర్తీ నిర్ణయం..

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ఖాళీలను భర్తి చేయడానికి హైకోర్టు 2023 వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించింది. ప్రత్యేకంగా ఆఫీస్‌, సాంకేతిక సిబ్బంది నియామకాలకు 8 నోటిఫికేషన్లు ఇచ్చింది. ఎగ్జామినర్ పోస్టులు, 77 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, 275 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 97 రికార్డు అసిస్టెంట్ పోస్టులు, 163 ప్రాసెస్ సర్వర్ పోస్టులు 1226 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు


ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 19, కోర్ట్ ఆఫ్‌ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్‌ సీబీఐ కేసెస్‌, హైదరాబాద్ 36, సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ 125, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్26, హనుమకొండ 19, జగిత్యాల 32, జనగామ13, జయశంకర్ భూపాలపల్లి 18, జోగులాంబ గద్వాల 25, కామారెడ్డి 14, కరీంనగర్ 12, ఖమ్మం 13, ఆసిఫాబాద్ 11, మహబూబాబాద్ 13, మంచిర్యాల 14, మహబూబ్ నగర్ 33, మెదక్ 16, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 92 సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు


మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్ 128 సబార్డినేట్ పోస్టులు, ములుగు 14, నాగర్ కర్నూలు 28, నల్గొండ 55, నారాయణపేట 11, నిర్మల్ 18, నిజామాబాద్ 20, పెద్దపల్లి 41, రాజన్న సిరిసిల్ల 26, రంగారెడ్డి 150, సంగారెడ్డి 30,
సిద్దిపేట 25, సూర్యాపేట 38, వికారాబాద్ 27, వనపర్తి 19, వరంగల్ 21, యాదాద్రి భువనగిరి జిల్లా 34 సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తారు.

పరీక్ష

పరీక్ష


ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉండగా.. దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉండనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు 11-01-2023 నుంచి 31-01-2023 వరకు స్వీకరిస్తారు. మార్చి 2023 పరీక్ష నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+