ఎన్‌పీసీఐఎల్‌లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ...
నిరుద్యోగులకు శుభవార్త.. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం బిటెక్ అర్హతతో ఉద్యోగం మీ సొంతం చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐఎల్‌లో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 400 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ముంబయిలోని అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది.
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. గేట్ స్కోర్ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన ఇంటర్వ్యూలు జూన్ 3 నుంచి 15 వరకూ జరుగుతాయి. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఇంటర్య్వూలను నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 30.04.2024 నిర్ణయించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను www.npcil.co.in సంప్రదించగలరు.

మొత్తం పోస్టుల వివరాలు..
400 పోస్టులు..
ఇందులో అన్‌రిజర్వుడ్‌కు 159 పోస్టులు,
ఈడబ్ల్యూఎస్‌లకు 39 పోస్టులు,
ఎస్సీలకు 61 పోస్టులు,
ఎస్టీలకు 32 పోస్టులు,
ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 109 పోస్టులు కేటాయించారు.
విభాగాల వారిగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (మెకానికల్)-150,
కెమికల్-73,
ఎలక్ట్రికల్-69,
ఎలక్ట్రానిక్స్-29,
ఇన్‌స్ట్రుమెంటేషన్-19,
సివిల్-60 ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ ఆరు విభాగాల్లో ఉన్న పోస్టులకు బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్)/ అర్హత ఉన్నవారు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 60 శాతం మార్కులతో పాసయిన వారు అర్హులు. తప్పనిసరిగా గేట్-2022/ 2023/ 2024 స్కోర్ కూడా కలిగి ఉండాలి.
వయోపరిమితి..
30.04.204 నాటికి జనరల్ అభ్యర్థుల వయసు 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు కేటగిరీని బట్టి పది నుంచి పదిహేనేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు వివరాలు..
ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునే జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థలకు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. అలాగే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, ఎన్‌పీసీఐఎల్ ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications