BHEL Recruitment 2025: ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలు.. మిస్ కావొద్దు..!
బీటెక్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL)లో 400 ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 29వ తేదీలోగా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
పోస్టుల సంఖ్య : 400
ఇంజినీర్ ట్రైనీలు: 150
1. మెకానికల్- 70
2. ఎలక్ట్రికల్- 25
3. సివిల్- 25
4. ఎలక్ట్రానిక్స్- 20
5. కెమికల్- 05
6.మెటలర్జీ- 05

సూపర్‌వైజర్ ట్రైనీ: 250
1. మెకానికల్- 140
2. ఎలక్ట్రికల్- 55
3. సివిల్- 35
4. ఎలక్ట్రానిక్స్- 20
అర్హత: ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణత. సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-02-2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో ఉత్తీర్ణత పొందిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎంపికైన జాబితా వెల్లడిస్తారు.
వేతనం: ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.50,000 కాగా.. సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32,000గా ఉంది.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1072 కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి రూ.472 గా ఉంది.
ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.02.2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.02.2025.
పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications